నితిన్ కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం అ ఆ. టైటిల్ వెరైటగా ఉంది. అ ఆ అంటే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. ఈ చిత్రాన్ని రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత, ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైల్ లో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారట.
ఇక అసలు విషయానికి వస్తే... నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే ఈ సినిమాని ఈ నెల 24న ప్రారంభించనున్నారు. అక్టోబర్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com