నాగార్జున భక్తి చిత్రం ప్రారంభం ఎప్పుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతం అన్నమయ్య. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. నాగార్జున ఏమిటీ...అన్నమయ్యగా నటించడం ఏమిటి..? అన్న వారికి నాగ్ తన నటనతో సమాధానం చెప్పి పరిపూర్ణ నటుడు అనిపించికున్నారు. ఆతర్వాత మళ్లీ నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన మరో అధ్యాత్మిక అద్భుతం శ్రీరామదాసు. ఈ సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంది. అన్నమయ్యకి అందుకున్నట్టే శ్రీరామదాసు చిత్రానికి కూడా నాగార్జున ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. దీంతో ఈతరంలో భక్తిరస చిత్రాలు చేయాలంటే ఒక్క నాగార్జునకే సొంతం అని నిరూపించారు.
నాగ్, రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన మూడవ భక్తిరస చిత్రం శిరిడి సాయి. ఈ సినిమాలో మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో బాబానే చూస్తున్నమా అనే ఫీల్ కలిగించారు నాగార్జున. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి...ఇలా మూడు భక్తిరస చిత్రాలు తీసిన నాగార్జున, రాఘవేంద్రరావు మరోసారి కలిసి భక్తిరస చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి వెంటేశ్వర స్వామి భక్తుడైన హతిరామ్ బాబా జీవిత కథ ఆధారంగా సినిమా తీయనున్నారు. ఈ సినిమాలో నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడు హతిరామ్ బాబాగా నటించనున్నారు.
ఈ చిత్రానికి జె. జె.కె.భారవి కథ అందిస్తున్నారు. శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం జనవరిలో ఈ సినిమా ప్రారంభించనున్నారు.నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో రానున్న ఈ భక్తిరస చిత్రం కూడా అధ్యాత్మిక అద్భుతంగా నిలుస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com