ప్రేమమ్ లో నాగ్ కనిపించేది ఎప్పుడో తెలుసా..!
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు మావయ్య విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే.
నాగార్జున కూడా గెస్ట్ రోల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయం పై నాగార్జునను అడిగితే....వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇక ఈ చిత్రంలో నటించడం గురించి చెప్పాలంటే...క్యారెక్టర్ అంటూ ఏమీ చేయలేదు. సినిమా లాస్ట్ లో కనిపిస్తాను అని చెప్పారు. ప్రేమమ్ ఆడియోను ఈనెల 20న రిలీజ్ చేసి, సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com