'బ్రూస్ లీ' ఆడియో రిలీజ్ ఎప్పుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 20 నిమిషాలు కనిపించి కనువిందు చేయనున్నారట చిరు.
దీంతో బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాంచరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే బ్రూస్ లీ ఆడియో రిలీజ్ ను ఈ నెల 26న ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మెగా హీరోలు పాల్గొనే ఈ ఆడియో వేడుకను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. బ్రూస్ లీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments