బాహుబలి 2 రిలీజ్ ఎప్పుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క..ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాహుబలి చూసిన వారందరూ బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇదే విషయం గురించి రాజమౌళిని అడిగితే...బాహుబలి 2 దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం.
2016 సమ్మర్ లో బాహుబలి 2 రిలీజ్ చేస్తామన్నారు. అయితే సెప్టెంబర్ వెళ్ళపోయి అక్టోబర్ వచ్చింది. కానీ బాహుబలి 2 షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీలో త్వరలోనే బాహుబలి 2 షూటింగ్ ప్రారంభించి... 2016 నవంబర్ లో బాహుబలి 2 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి..జక్కన్న 2016 నవంబర్ లో రిలీజ్ చేస్తాడో..లేక 2017 నవంబర్ లో రిలీజ్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com