మహేష్ గారు ఆ పాట విన్నప్పుడు పడి పడి నవ్వారు - దేవిశ్రీ ప్రసాద్

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. చిత్రానికి స్వరాలను అందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ..

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కదా ఇంకా ఏం చేయగలం అని ఎప్పుడైనా అనిపించిందా?

లక్కీ గా ఎప్పుడూ అలా అనిపించింది లేదు. ఎందుకంటే 2020 లో విడుదలయ్యే నా మొదటి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. నిజంగా ఇది నాకు ఫస్ట్ సినిమాలానే అనిపిస్తుంది. ప్రతి సినిమా కి ఆ భయం అయితే ఉంటుంది. 'అది ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ భయం మనలో ఉంటే ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ లా తీసుకొని చేస్తాము. ఈ విషయం 'మన్మధ బాణం' సినిమా చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు చెప్పారు. అలాగే మా టీమ్ అందరి ఎఫర్ట్ కూడా ఒక కారణం. మనచుట్టూ ఉన్నవాళ్ళని భయపడకుండా వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్పే ఫ్రీడమ్ ఇవ్వడం కూడా మన సక్సెస్ లో ఒక పార్ట్ అని నా భావన.

ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాస్ సాంగ్, ల‌వ్‌, పార్టీ సాంగ్ ఇస్తానని మాట ఇచ్చారు క‌దా?

ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా ఒక మాస్ సాంగ్ ఇస్తానని చెప్పాను. అలాగే 'మైండ్ బ్లాక్','డాంగ్ డాంగ్‌' సాంగ్ కి సోషల్ మీడియా లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. అందరి హీరోలకి మాస్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు మహేష్ గారికి మాస్ సాంగ్ చేయాలన్నకోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు కారణమైన అనిల్ రావిపూడి గారికి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నా అలాగే డిసెంబర్ లో మాస్ 'ఎస్ఎస్‌ఎంబి మండేస్' అని ప్రతి సోమవారం ఒక సాంగ్ ని విడుదల చేశాం. ఇది నాకు, మా టీమ్ అందరికీ ఒక పరీక్ష లాంటిది. అయితే విడుదల చేసిన ప్రతి సాంగ్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాటలను ఆదరించిన ప్రేక్షకులకి, మీడియా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

మహేష్ బాబుతో మీ జ‌ర్నీ గురించి?

మహేష్ గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో జర్నీ చేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను 'మహేష్ గారు కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు ఒక సూపర్ స్టార్ కి కావాల్సిన మంచి మనసు ఉంది'అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నేను వర్క్ చేశాను. అందరూ కూడా ఒకే మాట అంటారు ఏంటంటే 'మహేష్ తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది' అని. ఒక సారి కథ విని ఓకే అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన టెక్నీషియన్స్ కి సపోర్ట్ చేస్తారు. కంప్లీట్ గా డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. అంత పెద్ద స్టార్ మనమీద నమ్మకం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే పని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే అన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవ్వగలిగాను.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌?

అనిల్ రావిపూడి గారితో నేను 'ఎఫ్ 2' మూవీ చేశాను. ఈ సినిమాను చాలా ఎక్స్ట్రార్డినరీ గా హ్యాండిల్ చేశారు. అనిల్ అనగానే మనకు ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది. కానీ మహేష్ బాబు గారి సినిమాల్లో ఉండే సందేశం మిస్ కాకుండా, మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఎంత ఎనర్జీ గా చూడాలనుకుంటున్నారో ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్ గా ఈ సినిమా వచ్చింది. మహేష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. నేను ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే రిపీటెడ్ గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్ కి బోనస్.

సరిలేరు నీకెవ్వరు ఆంథ‌మ్‌ సాంగ్ గురించి?

నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం. ఇప్పటివరకు ఆ జోనర్ లో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. అనిల్ గారు ఫస్ట్ చెప్పడమే సరిలేరు నీకెవ్వరు అనేది ఆర్మీ వారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆంథ‌మ్‌ సాంగ్ 'భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు'.. నేనే రాశాను. ఆ లిరిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యూరప్ లో మేసెడోనియన్ సింఫనీ ఆర్కస్ట్రా తో రికార్డ్ చేశాం. వారు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యారు. మహేష్ గారు కూడా ఆ పాట విని డైరెక్టర్ ఒక కథ రెండున్నర గంటల కథ చెప్తే దేవి ఒక పాటలో వినిపించాడు. దేవి మామూలోడు కాదు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది.

మైండ్ బ్లాక్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా! దాని గురించి చెప్పండి?

నా దృష్టిలో ఒక పెద్ద హీరో నుండి మాస్ సాంగ్ వచ్చినపుడు ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అదేవిధంగా ఆ సాంగ్ కి హీరోకి లింక్ కూడా ఉండాలి అనేది నా కోరిక. అందులోనూ కథ చెప్పటప్పుడే మహేష్ గారిని పక్కా మాస్ గా చూపించబోతున్నాము అని చెప్పారు. నాకు చాలాఎగ్జైట్ మెంట్ వచ్చింది. అందుకే ఎపుడు ప్యాంటేసే వాడు ఇపుడు లుంగీ తొడిగాడు,.అని రాశాం. ఆ పాట‌ని మహేష్ గారు విన్నప్పుడు పడి పడి నవ్వారు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ నాతో చేయిస్తారా? అని అడిగారు. అందుకే కదా సర్ లిరిక్స్ లో రాశాం అని చెప్పాము. మీరు ముందునుండి ప్రిపేర్ అయి ఉన్నారు అన్నట్టుగా చూశారు. రేపు థియేటర్ లో ఆ సాంగ్ వేరే రేంజ్ లో ఉంటుంది.

తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు కదా ! రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారా?

తప్పకుండా అండీ, నేను అవార్డ్స్ ని రెండు కోణాలలో చూస్తాను. ఒకటి మన వర్క్ నచ్చి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారో దాన్ని మించిన అవార్డ్ లేదు. ఇక అవార్డ్ అనేది వారు మనకు ఇచ్చే గొప్ప గౌరవం. అది నాకు రెస్పాన్సిబుల్ ని పెంచుతుంది.

నిర్మాత అనిల్ సుంకర గురించి?

మా నిర్మాత అనిల్ సుంకర గారు చాలా స్వీట్ పర్సన్. చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. ఒక సాంగ్ యూరప్ వెళ్లి కంపోజ్ చేద్దాం అన్నప్పుడు తప్పకుండా చెప్పడం అని సపోర్ట్ చేశారు. ఒక ప్యూర్ సినిమా లవర్. మాస్ సాంగ్ చేయబోతున్నాం అన‌గానే తప్పకుండా చేద్దాం. మహేష్ గారిని అలా చూపించాలి. చాలా బాగుంటుంది. అని చాలా ఎగ్జైట్ అయ్యారు.

మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?

సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా చేస్తాను.

మీ తదుపరి సినిమాల గురించి ?

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోఒక సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది. అలాగే ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాను. నితిన్, కీర్తి సురేష్ ల ప్యూర్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’ చేస్తున్నాను. అలాగే కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' సినిమా కూడా చేస్తున్నాను. అలాగే హిందీలో ఒక సినిమా చేయబోతున్నాను దాని వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

More News

సీఎం జగన్ కేసులో తెలంగాణ మంత్రికి నోటీసులు!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఇప్పటికీ ఇంకా తేలలేదు. ఇదివరకే పలుమార్లు సీబీఐ కోర్టు విచారించినప్పటికీ ఇంతవరకూ తేల్చలేదు.

‘రాజధాని విషయంలో పెద్దన్న రంగంలోకి దిగాల్సిందే..’

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు విషయమై.. అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ రైతులు,

పూజా చెప్పిన పారితోషికానికి నిర్మాతలు షాక్!

‘నాకు నేనే పోటీ.. నాకెవ్వరూ లేరు సాటీ, పోటీ’ అంటూ అందాల భామ పూజా హెగ్దే టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది.

విజయశాంతే ఆ పాత్రకు కరెక్ట్.. నాన్నగారు సర్‌ప్రైజ్!

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

మహేశ్ ఇంటి ముందు ధర్నానా..? ‘సరిలేరు’ ప్రమోషన్ స్టంటా!?

అమరావతి తరలింపు వ్యవహారంపై నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.