అనుష్క పెళ్లి ఎప్పుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార అనుష్క ఇండస్ర్టీలో అడుగుపెట్టి అప్పుడే...పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా అరుంథతి, బాహుబలి, రుద్రమదేవి...ఇలా ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో నటించి ప్రేక్షక హ్రుదయాల్లో..సుస్ధిర స్ధానం సంపాదించింది.
ఇక అసలు విషయానికి వస్తే...అనుష్క పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా ఏవో వార్తలు వస్తూనే ఉన్నాయి. అనుష్క కి బిజినెస్ మ్యాన్ తో పెళ్లి కుదిరినట్టు..ఇద్దరు కలసి దుబాయ్ షాపింగ్ కి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయం గురించి అనుష్కని అడిగితే..ఈ వార్తలు నేను విన్నాను. మ్యారేజ్ షాపింగ్ కోసం దుబాయ్ వెళ్లినట్టు వార్తలు వచ్చిన రోజు నేను బాహుబలి షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు ఆ వార్త చూసి నవ్వుకున్నాను అన్నది. అది సరే...ఇంతకీ పెళ్లి ఎప్పుడు..? అంటే..నేను దేవుడిని నమ్ముతాను. ఆ దేవుడు ఎవరితో రాసి పెట్టి ఉంటే వాళ్లతో జరుగుతుంది అని చెబుతుంది. మరి...అనుష్క చెప్పేది నిజమేనా..? లేక తప్పించుకోవడం కోసం అలా..చెప్పిందా..? అనుష్కకే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com