ఆల్మోస్ట్ చనిపోయా.. బెంబేలెత్తిపోయిన నటుడు!
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరో హృతిక్ రోషన్ రిస్కీ స్టంట్స్ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే హృతిక్ నటించే చిత్రాల్లో యాక్షన్ సీన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇదిలా ఉండగా హృతిక్ నటించిన 'జిందగి నామిలేంగే దొబారా' చిత్రం పదేళ్లు పూర్తి చేసుకుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభయ్ డియోల్ కూడా నటించారు.
ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఓ భయంకర సంఘటనని అభయ్ గుర్తు చేసుకున్నారు. హృతిక్ చేసిన పనికి ఆ సమయంలో తన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని భావించినట్లు అభయ్ తెలిపాడు. విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న టైంలో ఈ సంఘటన జరిగింది.
ఇదీ చదవండి: 'కర్ణన్' బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్
హృతిక్ రోషన్ కారు డ్రైవ్ చేస్తుంటే.. తాను, ఫరాన్ అక్తర్ వెనుక సీట్లో కూర్చున్నాం. కారు ఏటవాలు ప్రాంతంలో ప్రయాణిస్తోంది. ఒక చోట హృతిక్ సడెన్ గా కారు ఆపి బయటకు వెళ్ళాడు. కానీ హ్యాండ్ బ్రేక్ వేయడం మరచిపోయాడు. ఏటవాలు ప్రాంతం కావడంతో కారు నెమ్మదిగా లోయ వైపు కదిలింది.
ఫరాన్ అక్తర్ వెంటనే గ్రహించి కారులోనుంచి దిగేశాడు. భయంతో నా మైండ్ పనిచేయలేదు. ఎం చేయాలో అర్థం కాలేదు. నా కళ్ళముందు మృత్యువు కనిపించింది. ఇక చనిపోయా అని ఫిక్సయిపోయా. హృతిక్ వెంటనే వెనక్కు వచ్చి కారు బ్రేక్ వేశాడు. దీనితో తాను ఊపిరి పీల్చుకున్నట్లు అభయ్ డియోల్ తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com