పర్మిషన్ వచ్చేసింది... తెర తొలిగేదెప్పుడు?
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మార్చి 15 నుంచి మూత పడ్డాయి. కాగా.. రాష్ట్రంలో సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్సులు కలిపి దాదాపు 650 వరకు ఉంటాయి. ఇవన్నీ మూతపడడంతో సినిమా రంగం అతలాకుతలమైంది. ఈ పరిశ్రమపై ఆధారపడిన వారి జీవితాలు అగాధంలో కూరుకుపోయాయి. థియేటర్లలో పని చేసే సిబ్బంది, చిత్ర నిర్మాణాల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రసాద్స్ ఐమాక్స్‌లో పని చేసే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు సైతం పాల్పడ్డాడు. కాగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీట్ల భర్తీతో థియేటర్లకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సోమవారం సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా కొన్ని వరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లను తెరిచేందుకు సైతం సానుకూల వాతావరణం కల్పించారు. దీంతో నేటి నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. 50 శాతం సీటింగ్‌తో థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ప్రేక్షకులు గుంపులుగా కాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించింది. మాస్క్‌లు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. థియేటర్లలో టెంపరేచర్ 24 నుంచి 30 మధ్య ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. తేమ శాతం 40 నుంచి 70 శాతం మేర ఉండాలని ప్రభుత్వం సూచించింది.
థియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వెంటనే చిన్న చిత్రాలు విడుదల చేసి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేయవచ్చని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ పేర్కొన్నారు. అయితే విజయేందర్‌రెడ్డి మాత్రం... ‘‘సినిమా హాళ్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. కానీ ఇప్పటికిప్పుడు థియేటర్లు ప్రారంభించాలంటే సినిమాలు అందుబాటులో ఉండాలి. రెండ్రోజుల్లో అసోసియేషన్ సమావేశం నిర్వహించి ప్రారంభ తేదీని ఖరారు చేస్తాం. ప్రాథమికంగా డిసెంబర్ 4 నుంచి థియేటర్లు ప్రారంభించాలని నిర్ణయించాం. ఒకవేళ ఎవరికైనా సినిమాలు వస్తే... థియేటర్లను ప్రారంభించుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు ఉండవు’’ అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments