2020 నుంచి ఈ స్మార్ట్ ఫోన్లలో ‘వాట్సాప్’ బంద్!
- IndiaGlitz, [Thursday,December 12 2019]
2019 ముగిసిపోవడానికి కొన్ని రోజుల ముందు యూజర్లపై వాట్సాప్ పిడుగు లాంటి వార్త విసిరింది. అవును మీరు వింటున్నది నిజమే.. ఫిబ్రవరి-01 నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ బంద్ కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి అటు వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల్లోకెళితే.. పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్‌ను నిలిపివేస్తున్నట్లు సదరు యాజమాన్యం తేల్చేసింది. కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్నవారికి మాత్రమే వాట్సాప్ అందుబాటులో ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా.. కొన్ని ఫోన్లలో వాట్సాప్ కొత్త వెర్షన్ వచ్చిన ప్రతీసారి ఇలా జరుగుతోందని యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించేవారు అయితే 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్.. ఐఫోన్ వాడుతున్న వారు ఐఓఎస్-08 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సదరు యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి-01 వరకు మాత్రమే ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేస్తుందని, తర్వాత పని చేయదు. అంతేకాదు.. విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఫోన్లన్నింటికీ కూడా వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. అయితే విండోస్ ఫోన్లకు ఇంకా త్వరగా ఈ సపోర్ట్ ను నిలిపివేయనున్నారు. ఇదిలా ఉంటే.. 2019 డిసెంబర్ 31 తర్వాత వీటికి వాట్సాప్ నుంచి ఎటువంటి అప్డేట్స్ రావు.