మరో కొత్త ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకురానున్న వాట్సాప్..
Send us your feedback to audioarticles@vaarta.com
వాట్సాప్ తన వినియోగదారుల కోసం వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్‌ను వినియోగించాలంటే ఇక మీదట ఓ పని చేయాల్సి ఉంటుంది. ఇకపై వెబ్ వాట్సాప్‌కు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని వాట్సాప్ సంస్థ యోచిస్తోంది. వాట్సాప్ ఈ విషయాన్ని గురువారం తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేవారు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. అయితే.. ఈ విధానం దుర్వినియోగమవుతోందని భావించిన వాట్సాప్ వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది.
ఈ క్రమంలోనే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ వెబ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే ముందు.. వినియోగదారుడు తన బయోమెట్రిక్ అంటే వేలిముద్ర లేదంటే ముఖ గుర్తింపును అందించాల్సి ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే ఇందులోనూ ఓ చిక్కుంది. ఇదే అమలైతే వాట్సాప్ పేమెంట్స్ నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని వినియోగదారులు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ కోసం ఓ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడించారు. అలాగే ఈ పాలసీని వ్యతిరేకించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటం విశేషం.
వెబ్ వాట్సాప్ కోసం చేపట్టనున్న బయోమెట్రిక్ విధానం గురించి తెలుసుకునేందుకు బీఎం నెక్స్ట్ అనే సంస్థ అభిప్రాయ సేరకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థ 17 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. వారిలో వెబ్ వాట్సాప్‌కు బయోమెట్రిక్ అందించాల్సి వస్తే వాట్సాప్ పేమెంట్ వాడకాన్ని ఆపేస్తామని 92 శాతం మంది వెల్లడించారు. 82% మంది కొత్త పాలసీని వ్యతిరేకించారు. కాగా, వాట్సాప్ కొత్తగా ప్రకటించిన ప్రైవసీ పాలసీ అమలైతే మాత్రం పేమెంట్ ఫీచర్ వాడకం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. దీనిపై వాట్సాప్ ఏం చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments