గూగుల్ పే, ఫోన్ పేలకు షాక్.. వాట్సాప్ పేమెంట్స్ స్టార్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
నేటి నుంచి సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జుకర్‌బర్గ్ వెల్లడించారు. దీంతో వినియోగదాలందరికీ నేటి నుంచి డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే యూపీఐ మార్కెట్‌లో దూసుకుపోతున్న గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటికి షాక్ తగలనుంది.
వాట్సాప్ పేమెంట్ చేయడమెలా?
వాట్సాప్ వినియోగదారులు ముందుగా డిజిటల్ పేమెంట్స్ కోసం వాట్సాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలి. దీని కోసం బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరమవుతుంది. కార్డు చివరి ఆరు నంబర్లు, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అనంతరం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. దీంతో రిజిస్టర్ ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది.
ఇక వాట్సాప్ డిజిటల్ ట్రాన్సక్షన్ షురూ అవుతుంది. ఇక డబ్బులు పంపించాలంటే.. వాట్సాప్‌లో పేమెంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. న్యూ పేమెంట్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే వాట్సాప్ కాంటాక్ట్ నంబర్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన వారికి డబ్బులు పంపించొచ్చు. అయితే ఇక్కడ అవతలి వారు కూడా వాట్సాప్ పేమెంట్ సర్వీసులను యాక్టివేట్ చేసుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే పేమెంట్ చెయ్యడం సాధ్యమౌతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout