గూగుల్ పే, ఫోన్ పేలకు షాక్.. వాట్సాప్ పేమెంట్స్ స్టార్ట్..

  • IndiaGlitz, [Friday,November 06 2020]

నేటి నుంచి సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌ తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. దీంతో వినియోగదాలందరికీ నేటి నుంచి డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే యూపీఐ మార్కెట్‌లో దూసుకుపోతున్న గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటికి షాక్ తగలనుంది.

వాట్సాప్ పేమెంట్ చేయడమెలా?

వాట్సాప్ వినియోగదారులు ముందుగా డిజిటల్ పేమెంట్స్ కోసం వాట్సాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలి. దీని కోసం బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరమవుతుంది. కార్డు చివరి ఆరు నంబర్లు, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అనంతరం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. దీంతో రిజిస్టర్ ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది.

ఇక వాట్సాప్ డిజిటల్ ట్రాన్సక్షన్ షురూ అవుతుంది. ఇక డబ్బులు పంపించాలంటే.. వాట్సాప్‌లో పేమెంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. న్యూ పేమెంట్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే వాట్సాప్ కాంటాక్ట్ నంబర్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన వారికి డబ్బులు పంపించొచ్చు. అయితే ఇక్కడ అవతలి వారు కూడా వాట్సాప్ పేమెంట్‌ సర్వీసులను యాక్టివేట్ చేసుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే పేమెంట్ చెయ్యడం సాధ్యమౌతుంది.

More News

మీ వాహనం మోడల్ అదైతే మాత్రం.. తిరుమలలో నో ఎంట్రీ..

తిరుమలలో వాహనాల మోడల్‌పై ఆంక్షలు విధించారు. తిరుమలతో పాటు.. ఘాట్ రోడ్లపై కాలం చెల్లిన వాహనాలకు అనుమతి నిరాకరించనున్నారు.

గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది: నాగ్

నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఏసీపీ విజయ్‌ వర్మగా ఈ చిత్రంలో నాగ్ నటిస్తున్నారు.

`నార‌ప్ప` షూటింగ్ షురూ..

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

పవర్ స్టార్ మెట్రో ప్రయాణం.. ఈ ఆసక్తికర విషయాన్ని గమనించారా?

జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మొట్టమొదటి సారి మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే.

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారో...

మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.