వార్నింగ్: వాట్సప్ యూజర్స్ వెంటనే అప్‌‌డేట్ చేయండి

  • IndiaGlitz, [Tuesday,May 14 2019]

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సప్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే మీ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ కంపెనీ యూజర్స్‌ అందర్నీ అప్రమత్తం చేస్తోంది. ఇందుకు కారణమేంటంటే.. ఇజ్రాయిల్‌కు చెందిన ‘అడ్వాన్స్‌డ్ సైబర్ యాక్టర్’ పేరుతో స్పైవేర్ రూపొందించి టార్గెట్ చేసినట్టు సమాచారం. తద్వారా యాప్‌లోని వాయిస్ కాలింగ్ ఫంక్షన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి మాల్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపిస్తున్నట్టు తేలింది. దీంతో పెనుప్రమాదం పొంచి ఉండటంతో అప్రమత్తమైన వాట్సప్.. క్షణాల్లోనే ఈ సమస్యను పరిష్కరించింది. దీంతో వెంటనే వినియోగ దారులందర్నీ తమ వాట్సప్‌ను అప్‌డేట్ చేయాలని కంపెనీ అప్రమత్తం చేసింది. అంతేకాదు.. ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అప్‌డేట్ వర్షన్‌ను సదరు సంస్థ విడుదల చేసింది.

అప్‌‌డేట్ చేయకపోతే..!?

కాగా.. ఇన్ని రోజులూ మీరు వాట్సప్‌లో సీక్రెట్‌గా ఛాటింగ్ చేసుకోవడం, వీడియో కాల్స్ చేసుకోవడం ఇంకా ఏదేదో చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఓకే.. అంతా కంపెనీనే చూసుకున్నది. అయితే ఇకపై అస్సలు కుదరదు మరి. మీ సందేశాలు.. ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే.. యూజర్ల జోక్యం లేకుండా ఇన్-యాప్ వాయిస్ కాల్స్ ద్వారా యూజర్లను ఎన్ఎస్ఓ గ్రూప్ టార్గెట్ చేసినట్టు తేలింది. అందుకే అప్రమత్తమై వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఒక వేళ అప్‌డేట్ చేయకపోతే మీకే ప్రమాదం పొంచి ఉన్నట్లే.. అంతేకాదు మీ డేటా మొత్తం పక్కనోడి చేతిలో పెట్టేసినట్లే.. ఒక్కమాటలో చెప్పాలంటే మీ రహస్య సమాచారం అంతా వేరొకరికి తెలిసిపోతుందన్న మాట.

వాయిస్ ఎలా వస్తుంది..? ఇదెలా సాధ్యం!

వాట్సప్ వాడే వినియోగదారులకు మొదట ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాయిస్ కాల్ వస్తుంది. అది కాల్ కాదు.. జస్ట్ మిస్డ్ కాల్ మాత్రమే.. ఈ కాల్ ద్వారా ‘స్పైవేర్’ మీ ఫోన్‌లోకి వెళ్తుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను మొత్తం కాజేస్తుంది. దీంతో మీ వాట్సప్ చాటింగ్‌లు, మీకు సంబంధించిన ఇతరత్రా వివరాలన్నీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతాయి.! అంతేకాదు.. ఒకవేళ మీరు ఫోన్ రాగానే రిసీవ్ చేసుకున్నా.. మిస్డ్ కాల్ అని పడినా సరే.. ఆ వైరస్ మీ ఫోన్‌లోకి వెళ్తుంది. అయితే ఇది కొంత మందినే టార్గెట్ చేసిందా..? వాట్సప్ యూజర్లందర్నీ టార్గెట్ చేసిందా అనేది ఇంతవరకూ తెలియరాలేదు.. అందుకే అప్రమత్తమై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకోండి.

More News

రామ్ పుట్టినరోజున 'ఇస్మార్ట్ శంక‌ర్‌' టీజ‌ర్ విడుద‌ల‌

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న  చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. 'డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ' ట్యాగ్ టైన్‌.

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు కథ ముగిసింది.. సెలిబ్రిటీలందరికీ క్లీన్ చిట్!

టాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపిన డ్రగ్ కేసు వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఏబీసీడీ సినిమా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను - నాని

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'.

ఏపీ పది ఫలితాలు విడుదల.. తూ.గో టాప్.. నెల్లూరు లాస్ట్

ఆంధ్రప్రదేశ్‌ పది ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 6,30,082 మంది విద్యార్థులు

ప‌రువు హ‌త్య‌లే ప్ర‌ధానంగా 'ఉప్పెన‌'..

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందుతున్న సినిమాలకు ఈ మ‌ధ్య ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి. అదే కోవ‌లో మెగా కాంపౌండ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ సినిమా `ఉప్పెన‌` తెరకెక్క‌నుంది.