పచ్చని కాపురంలో ‘వాట్సాప్’ చిచ్చు.. ప్రియుడితో భార్య ఉండగా..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వివాహేతర సంబంధాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతి రోజూ అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు టీవీల్లో , పేపర్లలో వస్తూనే ఉన్నాయ్. తాళి కట్టి.. ఏడడుగులేసిన భర్తను కాదనుకొని భార్య వేరొకరితో సంబంధం పెట్టుకోవడం.. కట్టుకున్న భార్యను కాదనుకుని వేరో మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం.. ఇలా ఏదైతేనేం చివరికి కుటుంబం రోడ్డున పడుతోంది. అలా ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో ఈ పక్కనుండే ఫొటోను కాస్త నిశితంగా గమనిస్తే వ్యవహారం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ అసలు సంగతి..!
ఇదిగో మీరు చదువుతున్న ఈ ఘటన ఆంధ్రప్రదేవ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన సలీం.. పర్వీన్‌లకు పదేళ్ల క్రితం పెళ్లైంది. పదేళ్ల పాటు వీరి కుటుంబంలో చిన్నపాటి గొడవలొచ్చినా సర్దుకునిపోయారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సలీం ఆటో మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. భార్య పిల్లలను చూసుకుంటోంది. అయితే ఇంతవరకూ అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఓ ఆటో డ్రైవర్ ఈ ఇద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే ఈ పచ్చని కాపురంలో పొరుపచ్చాలు వచ్చాయ్. పర్వీన్ ఫోన్ నంబర్‌ను ఓ మహిళ ద్వారా తెలుసుకున్న షేక్ షుకూర్ అనే ఆటో డ్రైవర్.. ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ.. వాట్సాప్ చాటింగ్ చేసుకునేవారు. అయితే ఆ పరిచయం కాస్త అక్రమసంబంధంగా మారింది. ఇద్దరూ కలవడం కూడా మొదలెట్టారు. ఈ క్రమంలో భార్య తీరుపై అనుమానంతో భర్త కాపుకాసి మరీ ఆ ఇద్దరి గుట్టును రట్టు చేశాడు.
సెల్ నిండా ఫొటోలే..!
భర్తకు డ్యూటికి వెళ్ళగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్న భార్య రాసలీలల్లో మునిగితేలింది. ఈ క్రమంలో డ్యూటీకి అని చెప్పి వెళ్లిన తన కుటుంబ సభ్యులతో వెళ్లి భార్య-ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికి నాలుగు దెబ్బలేసి అనంతరం ఆ ఆటో డ్రైవర్‌ను పోలీసులకు పట్టించారు. కాగా షేక్ షుకూర్ ఫోన్ నంబర్ స్వాధీనం చేసుకోగా అందులో చాలా వరకు మహిళల ఫొటోలో ఉన్నాయని తెలిసింది. ఎక్కువగా సెల్ఫీలు, వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్... ఆడవాళ్లతోనే మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com