యూజర్స్‌కు సారీ చెప్పిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్!
- IndiaGlitz, [Thursday,July 04 2019]
ప్రపంచ వ్యాప్తంగా బుధవారం నాడు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. భారత్, బ్రిటన్ సహా పలుదేశాల్లో ఈ మూడు మెసెంజిగ్ యాప్‌లు నిలిచిపోయాయి. దీంతో పంపిన మెసేజ్‌లు వెళ్లకపోవడం.. వేరేవాళ్లు పంపిన మెసేజ్‌లు రిసివ్ కాకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఫేస్‌బుక్ ఆధీనంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మధ్య కామన్ సర్వర్‌లో సమస్య తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ యాప్‌ల సేవలు ఆగిపోయాయి.
క్షమించండి!
అయితే బుధవారం నాడు ఏర్పడ్డ ఈ సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో గురువారం నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం సేవలు తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేశాయి. అసలేం జరిగింది..? సమస్య ఎక్కడొచ్చింది..? అనే విషయాలపై సదరు దిగ్గజ సంస్థలు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చాకున్నాయి. సేవలకు అంతరాయం కలిగినందుకు యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాము. నేటి నుంచి యధాతథంగా పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తెచ్చాము.. ఇక ముందు ఎలాంటి సమస్యలు రావు.. అందుకు తగ్గ చర్యలు తీసుకున్నాం. సర్వర్లలో తలెత్తిన సమస్య కారణంగా ఫేస్‌బుక్ సరిగ్గా పనిచేయలేదు అని సదరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.
అసలు సమస్య ఏంటి..!?
వాస్తవానికి ఇంత వరకూ ఈ మూడు యాప్‌లకు సంబంధించి ఎలాంటి సమస్య రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. మామూలుగా నిర్వహించే మెయిన్‌టెన్స్ సమయంలో కొందరు యూజర్లకు అప్‌లోడ్ సమస్య ఎదురైందని.. ఆ సమస్యను గుర్తించి పరిష్కరించామని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. అయితే మున్ముంధు ఎలాంటి సమస్యలు తలెత్తవని.. కచ్చితంగా 100 శాతం సేవలు యూజర్లకు అందుబాటులో ఉంటాయని సదరు సంస్థలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే ఇక ముందైనా ఇలాంటి సమస్యలు రాకుండా ఆ సంస్థలు చూసుకుంటాయో లేదో వేచి చూడాల్సిందే మరి