నగల దొంగను పట్టిచ్చిన వాట్సాప్...
Send us your feedback to audioarticles@vaarta.com
దొంగతనం జరిగిన 15 నెలల తరువాత దొంగ అనూహ్యంగా పట్టుబట్టాడు. ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించలేదు. దొంగను బాధితురాలే పట్టుకోవడం ఆసక్తికరం. అసలు ఈ దొంగతనం గుట్టును వాట్సాప్ రట్టు చేయడం మరింత ఆసక్తికరం. అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిపురి కాలనీలో అంగిడి రవికిరణ్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. ఆ వ్యక్తి ఇంట్లో గత ఏడాది దొంగతనం జరిగింది.
రవికిరణ్ 12 జూలై 2019న గుడికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తొలుత తాను ఇంటిని లాక్ చేయడం మరిచిపోయానేమోనని భావించాడు. తరువాత ఇంట్లోకి వెళ్లి చూడగా.. గోల్డ్ జ్యువెలరీ మొత్తం మాయమైంది. దీంతో రవికిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగతనం కేసును రిజిస్టర్ చేశారు. కానీ 15 నెలలు గడుస్తున్నా పోలీసులు మాత్రం ఈ కేసును ఛేదించలేకపోయారు. ఇక పోయిన బంగారం దొరికే అవకాశం లేదని రవికిరణ్ కుటుంబం ఆశలు వదిలేసుకుంది.
కాగా.. ఒకరోజు రవికిరణ్ పక్కింటావిడ తనకు సంబంధించిన ఒక ఫోటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టింది. ఆ ఫోటో చూసిన రవికిరణ్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కారణం పక్కింటావిడ ధరించిన బంగారు ఆభరణం తమ ఇంట్లో చోరీకి గురైందే కావడం. వెంటనే రవికిరణ్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే పోలీసులు రవికిరణ్ పక్కింటి వాళ్లను విచారించగా.. పక్కింటావిడ కుమారుడైన పొన్నుగంటి జితేందర్ ఆ నగలను దొంగిలించినట్టు వెల్లడైంది. వెంటనే పోలీసులు జితేందర్‌ను అరెస్ట్ చేశారు. దొంగిలించిన ఆభరణం అని తెలిసినప్పటికీ ఆ నగను ధరించినందుకు గాను పోలీసులు జితేందర్ తల్లికి కూడా నోటీసులు ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com