ఆయనొకటి.. ఈయనేమో మూడు.. అసలేంటీ కథ చంద్రులు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు-వైసీపీ అధినేత వైఎస్ జగన్ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం.. బాబొచ్చి వేలు పెట్టడంతో తీవ్ర దుమారం రేగిపోయింది. అప్పటి వరకూ అంతా చక్కాగానే ఉందనుకున్న తరుణంలో కేసీఆర్ ఎంటరై అనవరంగా ఇక్కడ వేలుపెడితే కచ్చితంగా తామే ఊరుకునేది లేదని ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తానని గులాబీ బాస్‌తో పాటు పలువురు కీలక నేతలు అనడం చర్చనీయాంశమైంది.
రాజకీయ చాణక్యుడు, ఎంతటి వారినైనా సరే ఎదుర్కోని ‘ఢీ’ కొట్టగలిగే చంద్రబాబు వ్యూహాలకు పదునుపెట్టారు. ఏపీకి వచ్చి నాకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా..? అని కన్నెర్రజేసి ‘మీరు ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. మేము మూడు రిటర్న్ గిఫ్టులు ఇస్తాం’ అని కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా కౌంటరిచ్చారు. అయితే ఇద్దరు చంద్రులు ఏమేం రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు..? అసలేం జరగబోతోంది..? ఇంతకీ కేసీఆర్ ఇచ్చే ఆ గిఫ్ట్ ఏంటిది..? అని తెలుగు ప్రజలు ఆలోచనలో పడ్డారు. దీంతో ‘రిటర్న్ గిఫ్ట్’ దేశవ్యాప్తంగా చర్చకు దారిదీసింది.
మాకేం చేతకాదా..!
మీరు రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తామంటుంటే మేం ఎలా కనపడుతున్నాం.. మాకేం చేతకాదనుకుంటున్నారా.. అసలు ఎన్డీఏ నుంచి బయటికొచ్చేసిన తర్వాత కేసీఆర్, మోదీ తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో లాగా ఏపీలో కూడా సెంటిమెంట్ మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మనం ఇవాళ ఇన్ని కష్టాల్లో ఉండటానికి కారణం మోదీనే.. పుండుమీద కారం చల్లి సంతోషిస్తున్నారని బాబు కన్నెర్రజేశారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో పోటీపడలేక ఓ వైపు కేసీఆర్.. మరోవైపు మోదీ ఇద్దరూ ఏపీపై దాడులు చేయడానికి వస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మొత్తానికి చూస్తే ఈ ‘రిటర్న్’ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఫుల్ స్టాప్ పడేలాలేదు. అసలు ఈ ఇద్దరు చంద్రులు ఎలాంటి ‘రిటర్న్ గిఫ్ట్’లు ఇచ్చిపుచ్చుకుంటారో..? లేకుంటే ఇవన్నీ మాటలకే పరిమితమవుతాయో..? తెలియాలంటే మార్చి నెల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout