రాహుల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కుట్ర జరిగిందా!?

  • IndiaGlitz, [Friday,April 26 2019]

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి పాట్నాకు ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పాట్నాకు వెళ్లకుండా ఢిల్లీకి విమానం వెనక్కి వచ్చింది.

ఇంజన్‌లో లోపం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ బీహార్, ఒరిస్సాల్లో జరిగే బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉంది. సభకు రావడానికి ఆలస్యమవుతుందని రాహుల్ అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అసలేం జరిగింది..!?

ఇదిలా ఉంటే.. రాహుల్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఆ విమానంలో సమస్య తలెత్తిన సమయంలో ఇద్దరు సిబ్బంది సహా 12 మంది విమానంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. ఇదిలా ఉంటే గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ రాహుల్‌కి ఇలాంటి ఘటనే ఎదురైంది..

తాజాగా కూడా ఇలాంటి ఘటనే ఎదురవ్వడంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏదో కుట్ర దాగుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు స్పందించిన డీజీసీఏ అధికారులు.. ఎలాంటి కుట్రలేదని.. ప్రమాదం చాలా చిన్నదేనని స్పష్టం చేయడం గమనార్హం. అయితే విచారణలో అధికారులు ఏం తేలుస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సైనా, సింధు.. ప్రత్యర్థులకు దడ!

చైనాలోని వుహాన్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సమీర్ వర్మలు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

విద్యార్థుల ఆత్మహత్యల పై మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్!

తెలంగాణ ఇంటర్ ఫలితాల అనంతరం అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలతో చలించిపోయిన టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

వారణాసిలో నరేంద్ర మోదీ నామినేషన్.. బలప్రదర్శన!

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి

బాలీవుడ్‌కు ర‌ష్మిక‌

శాండీవుడ్ సొగ‌స‌రి ర‌ష్మిక మంద‌న్న.. తెలుగు చిత్ర‌సీమ‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. త‌మిళంలో కూడా కార్తి స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తుంది. ద‌క్షిణాదిన ర‌ష్మిక‌కు క్రేజీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.

'ఎన్‌.జి.కె' ఆడియో డేట్‌

సూర్య వరుస సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఆయన నటించిన 37వ చిత్రం 'ఎన్‌.జి.కె'. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో