కొవిడ్-19పై సమాచారం కోసం వాట్సాప్ చాట్ బోట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బోట్‌ను ఆవిష్కరించడం జరిగింది. 9000 658 658 నంబరుపై వాట్సాప్‌లో చాట్ బోట్‌తో ఎవరైనా సంభాషించవచ్చు. కరోనాపై ప్రజలు అడిగే అన్ని సందేహాలకు ఈ చాట్ బోట్ సమాధానమిస్తుంది. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పౌరులకు తెలియజేసేందుకు ఈ వాట్సాప్ వేదికను ఉపయోగించుకోనుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. ‘కరోనా వైరస్‌పై పోరుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో ఈ నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించింది. లాక్ డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలి. అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలి’ కేటీఆర్ తెలిపారు.
ఇలా చేస్తే మాట్లాడొచ్చు..
- చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి +91-9000658658 నంబరుకి ‘Hi’ లేదా ‘Hello’ లేదా ‘Covid’ అని వాట్సాప్‌లో సందేశం పంపించాలి.
- https://wa.me/919000658658? text=Hi లింకును తమ మొబైల్ నుండి క్లిక్ చేయాలి.
- సూచనలు covid19info-itc@telangana.gov.in కి ఈమెయిల్ చేయవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments