కొవిడ్-19పై సమాచారం కోసం వాట్సాప్ చాట్ బోట్

  • IndiaGlitz, [Tuesday,April 07 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బోట్‌ను ఆవిష్కరించడం జరిగింది. 9000 658 658 నంబరుపై వాట్సాప్‌లో చాట్ బోట్‌తో ఎవరైనా సంభాషించవచ్చు. కరోనాపై ప్రజలు అడిగే అన్ని సందేహాలకు ఈ చాట్ బోట్ సమాధానమిస్తుంది. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పౌరులకు తెలియజేసేందుకు ఈ వాట్సాప్ వేదికను ఉపయోగించుకోనుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. ‘కరోనా వైరస్‌పై పోరుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో ఈ నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించింది. లాక్ డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలి. అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలి’ కేటీఆర్ తెలిపారు.

ఇలా చేస్తే మాట్లాడొచ్చు..

- చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి +91-9000658658 నంబరుకి ‘Hi’ లేదా ‘Hello’ లేదా ‘Covid’ అని వాట్సాప్‌లో సందేశం పంపించాలి.

- https://wa.me/919000658658? text=Hi లింకును తమ మొబైల్ నుండి క్లిక్ చేయాలి.

- సూచనలు covid19info-itc@telangana.gov.in కి ఈమెయిల్ చేయవచ్చు.

More News

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన

మేం అడిగితే ఇవ్వరా.. భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్

కరోనా వైరస్‌పై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కాస్త వర్కవుట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇండియాలో మెండుగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి..

క‌రోనా పై యుద్ధానికి ఆదిత్య మ్యూజిక్ 31 ల‌క్ష‌ల విరాళం

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం

దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చైత‌న్య‌..!!

అక్కినేని నాగచైత‌న్య ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరి సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కరోనా వైరస్ తగ్గిన తర్వాత సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తారు.

అన్న‌య్య స్థానాన్ని త‌మ్ముడు భ‌ర్తీ చేస్తాడా?

అన్నీ అనుకున్న‌ట్లు సాగుంటే మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. అయితే క‌రోనా వైర‌స్