రానా... మీరు విన్న‌ది నిజ‌మే

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

రానా హీరోగా హిర‌ణ్య క‌శ్య‌పుడి క‌థ‌తో ఓ చిత్రం తెర‌కెక్కనున్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వింటూనే ఉన్నాం. అయితే జూన్ ఒక‌టిన ఈ సినిమాకు సంబంధించి అఫిషియ‌ల్‌గా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వార్త‌ను వినిపించిన వారు మ‌రెవ‌రో కాదు... ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రానా ఈ సినిమాను చేయ‌బోతున్నారు. గుణ‌శేఖ‌ర్ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

''హిర‌ణ్య క‌శ్య‌ప చిత్రాన్ని రానాతో చేయ‌బోతున్నాం. దీనికి సంబంధించి మూడేళ్లుగా స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. మీరు విన్న‌ది నిజ‌మే. మూడేళ్లుగానే స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది'' అని ఆయ‌న ట్వీట్ చేశారు. 'బాహుబ‌లి'లో రానా ఫిజిక్ చూసిన వాళ్లెవ‌రైనా ఆయ‌న హిర‌ణ్య‌క‌శ్య‌పుడి పాత్ర‌కు క‌చ్చితంగా స‌రిపోతార‌ని ఒప్పుకోక‌మాన‌రు. 'రుద్ర‌మ‌దేవి' చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించిన గుణ‌శేఖ‌ర్ ఈ తాజా చిత్రాన్ని కూడా సొంతంగా నిర్మిస్తారా? లేకుంటే సురేష్ ఫ్రొడ‌క్ష‌న్స్ స‌హ‌కారంతో నిర్మిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

More News

సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నవశకానికి నాంది పలికారు.

మోక్ష‌జ్ఞ‌... కాఫీ ల‌వ‌ర్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కోకొల్ల‌లు.

పవన్ సిగ్గుపడాలి.. చంద్రబాబు వాటర్ బాటిల్స్ కనిపించవ్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

జూలై 5న స‌మంత అక్కినేని ఫ‌న్ రైడ‌ర్‌ `ఓ బేబీ` విడుద‌ల‌

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ` ఓ బేబీ`. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు

మురళీ మోహన్‌కు ఆపరేషన్.. చిరు దంపతుల పరామర్శ

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు.