రానా... మీరు విన్నది నిజమే
Send us your feedback to audioarticles@vaarta.com
రానా హీరోగా హిరణ్య కశ్యపుడి కథతో ఓ చిత్రం తెరకెక్కనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే జూన్ ఒకటిన ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్‌గా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వార్తను వినిపించిన వారు మరెవరో కాదు... దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలోనే రానా ఈ సినిమాను చేయబోతున్నారు. గుణశేఖర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
``హిరణ్య కశ్యప చిత్రాన్ని రానాతో చేయబోతున్నాం. దీనికి సంబంధించి మూడేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మీరు విన్నది నిజమే. మూడేళ్లుగానే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది`` అని ఆయన ట్వీట్ చేశారు. `బాహుబలి`లో రానా ఫిజిక్ చూసిన వాళ్లెవరైనా ఆయన హిరణ్యకశ్యపుడి పాత్రకు కచ్చితంగా సరిపోతారని ఒప్పుకోకమానరు. `రుద్రమదేవి` చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గుణశేఖర్ ఈ తాజా చిత్రాన్ని కూడా సొంతంగా నిర్మిస్తారా? లేకుంటే సురేష్ ఫ్రొడక్షన్స్ సహకారంతో నిర్మిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com