వెంకీ ఎటు మొగ్గుతారు?
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు పదుల సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా పూర్తి చేశారు విక్టరీ వెంకటే్‌ష్. కెరీర్లో ఎక్కువగా హిట్ల శాతం ఉన్న కథానాయకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన బాబు బంగారం ఆగస్టు 12న విడుదల కానుంది. ఆ తర్వాత ఆయన ఓంకార్ దర్శకత్వంలో నటిస్తారని కొందరు, పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేస్తారని ఇంకొందరు అంటున్నారు. గతేడాది ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి బంగ్లా పెద్ద హిట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓంకార్ దానికి సీక్వెల్ చేశారట. ఆ కథ వెంకటేష్‌కి అయితే సరిపోతుందని అనుకుంటున్నారట.
ఈ మధ్యనే తరుణ్ భాస్కర్ కూడా ఓ కథను వినిపించారట. ఇది కూడా హారర్ నేపథ్యంలో సాగేదే. హారర్ థ్రిల్లర్ తరహాను ఇప్పటిదాకా వెంకీ పూర్తి స్థాయిలో అటెమ్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఆ జోనర్లో సినిమా చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ రెండు స్క్రిప్టుల్లో దేన్ని సెలక్ట్ చేస్తారో చూడాలి. తాను ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నానని, తరుణ్ భాస్కర్ ఆల్రెడీ హారర్ కామెడీతో కథ చెప్పాడని, ఆ సినిమాను సురేశ్‌బాబు సరేనంటే సురేష్ ప్రొడక్షన్స్ తోనే కలిపి చేస్తాననీ ఈ మధ్యనే ధర్మపథ క్రియేషన్స్ అధినేత రాజ్ కందుకూరి చెప్పారు. సో ఒకవేళ తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ ను కనుక వెంకీ ఓకే చేస్తే రెండు ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి నిర్మిస్తాయన్నమాట. ఓంకార్ సినిమాను మాత్రం సురేష్ ప్రొడక్షన్స్ చేసే అవకాశాలుంటాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments