ఫిబ్రవరి 1న లగడపాటి ఏం చెప్పబోతున్నారు!?

  • IndiaGlitz, [Tuesday,January 29 2019]

తెలంగాణ ఎన్నికల్లో సర్వే అట్టర్ ప్లాప్ అవ్వడంతో అడ్రస్ లేకుండా పోయిన ఆంధ్రా ఆక్టోపస్ మళ్లీ తెరమీదికి రానున్నారా..? రాష్ట్ర విభజనాంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారా..? రీ ఎంట్రీ ఇచ్చేది టీడీపీ నుంచేనా..? టీడీపీ నుంచి ఎంపీ టికెట్ కూడా ఫిక్స్ అయిపోయిందా..? అంటే వీటన్నింటికీ ఏకైక సమాధానం అవునంతే.

లగడపాటి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆక్టోపస్ ఒక్కసారి ఖండించిన దాఖలాల్లేవ్. అప్పట్లో తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో లగడపాటి సర్వే బొమ్మ అదిరిపోతుంది..? ఇక కూటమికి తిరుగుండని ఆయన లెక్కల ప్రకారం అందరూ అనుకున్నారు. అయితే అదికాస్త సీన్ రివర్స్ అవ్వడం కనివినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ గెలుపొందడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకూ మీడియా ముందకు పెద్దగా రాని ఆక్టోబస్ సడన్‌‌గా మైకు గొట్టాల ముందకొచ్చి సంచలన ప్రకటన చేశారు.

ఫిబ్రవరి 1న ఏం చెప్పబోతున్నారు..?

ఇటీవల మీడియా ముందుకొచ్చిన లగడపాటిని మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ముంచెత్తారు. దీంతో ఆయనకు ఏం సమాధానం చెప్పాలో దిక్కుతెలియలేదు. అయితే రీ-ఎంట్రీపై మాత్రం స్పందించిన ఆక్టోపస్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా మాట్లాడారు. ఫిబ్రవరి 1న తన నిర్ణయం చెప్పబోతున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆయన ఆ రోజు ఏం ప్రకటన చేయబోతున్నారు..? ఏ పార్టీ నుంచి రీ ఎంట్రీ ఇస్తారనే దానిపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

రీ-ఎంట్రీ టీడీపీ నుంచేనా..!?

ప్రస్తుత పరిస్థితుల్లో లగడపాటి.. కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లడం గగనమే. ఇప్పటికే చాలాసార్లు సీఎం చంద్రబాబును నేరుగా కలిసిన ఆక్టోపస్ రీ-ఎంట్రీ చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే లోక్‌సభ కాకుండా రాజ్యసభ ఫిక్స్ చేస్తానని బాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఎంపీ సీటు వ్యవహారం తెలంగాణ ఎన్నికల ముందు నుంచే టాక్ నడుస్తోంది. అయితే రీ ఎంట్రీ ఎంత వరకు నిజం..? ఆయన నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా..? లగడపాటి టీడీపీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది..? తెలంగాణలో చేసిన సర్వేతో ఇప్పటికే జనాలు ఆయనపై పీకల్లోతు కోపంతో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో లగడపాటి రాకను జనాలు ఎలా అర్థం చేసుకుంటారు..? అసలింతకీ ఫిబ్రవరి 1న లగడపాటి చెప్పబోయేది రీ ఎంట్రీనా..? లేకుంటే ఏపీ ఎన్నికల సర్వేలు వెల్లడించబోతున్నారా..? అనేది తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

చంద్రబాబుకు చురకలంటించిన పురందేశ్వరి..!

దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరికపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పై ఉపాసన కొణిదెల క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ కోడలు, హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రాజకీయాల్లోకి వస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కంచుకోటలో జగన్‌కు కోలుకోలేని షాక్!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టికెట్లు ఆశించిన నేతలకు అధిష్టానం మొండిచేయి చూపడంతో జంపింగ్‌లు షురూ చేశారు. ఇప్పటికే పలువురు అధికార

అజిత్ జోడిగా బాలీవుడ్ హీరోయిన్...

'విశ్వాసం' తో హిట్ సాధించిన హీరో అజిత్ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో అమితాబ్ పోషించిన లాయ‌ర్ పాత్ర‌లో అజిత్ న‌టించ‌నున్నారు.

నిర్మాత కోసం శ‌ర్వా ఏం చేస్తున్నాడంటే

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' చిత్రంతో శ‌ర్వానంద్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.