ఇక రామ్ చరణ్ కి ఏం జరుగుతుందో?
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్న సినిమాలతో తొలి అడుగులు వేసి.. వరుస విజయాలతో తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆరంభంలో ఆమె నటించిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 'కిక్ 2', 'బ్రూస్ లీ' చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ఆ తరువాత మాత్రం రకుల్ కి కాస్త మంచి ఫలితాలే వస్తున్నాయి భారీ బడ్జెట్ చిత్రాల పరంగా. ముఖ్యంగా ఈ ఏడాదిలో వచ్చిన రెండు స్టార్ హీరోల సినిమాలు ఆయా కథానాయకుల కెరీర్లో టాప్ గ్రాసర్స్ గా నిలవడం రకుల్ కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.
ఎన్టీఆర్‌తో రకుల్ కలిసి నటించిన 'నాన్నకు ప్రేమతో'.. ఫలితం పరంగా ఎబౌవ్ యావరేజ్ అయినా మునుపెన్నడూ లేని విధంగా తారక్ సినిమాల్లో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే యుఎస్ లో టాప్ 3 గ్రాసర్ గా నిలిచిన టాలీవుడ్ మూవీ అనిపించుకుంది.
ఇక అల్లు అర్జున్‌తో రకుల్ నటించిన 'సరైనోడు' రిలీజ్ టైంలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కట్ చేస్తే.. బన్ని కెరీర్లోనే అతి పెద్ద హిట్ సినిమా అయి కూర్చుంది. అంతేకాకుండా.. టాలీవుడ్లో టాప్ 5 గ్రాసర్‌గా నిలిచింది. దీంతో రకుల్ తదుపరి చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ లెక్కన ఉన్న చిత్రం.. రామ్‌చరణ్‌తో చేస్తున్న 'తని ఒరువన్' రీమేక్. మరి.. రకుల్ టచ్‌తో చరణ్ కెరీర్లోనే పెద్ద హిట్ అయిన 'మగధీర'ని మించేలా ఈ సినిమా ఫలితం ఉంటుందో లేదోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. అక్టోబర్‌లో చరణ్, రకుల్ కొత్త చిత్రం విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com