Chandrababu: సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది..? చంద్రబాబు భవితవ్యంపై సస్పెన్స్..?
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 29 నుంచి రాజకీయ కార్యకలాపాలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. దీంతో చంద్రబాబు రాక కోసం పార్టీ శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంతో దాదాపు మూడు నెలల పాటు చంద్రబాబు ప్రజలకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. కానీ స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన ఆయన 52రోజులు రాజమండ్రి జైలులో ఉన్నారు. అనంతరం మధ్యంతర బెయిల్ వచ్చినా ఈనెల 28 వరకు కోర్టు షరతులు విధించడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కోర్టు షరతులు తొలగించడంతో ప్రజల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
ఇంతవరకు బాగానే ఉంది హైకోర్టు బెయిల్‌పై సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ విచారణకు వచ్చినా ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ రద్దు చేయడం అనేది ఉండకకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ దొరికినట్లు కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనపై మొత్తం ఆరు కేసులు నమోదుకాగా.. స్కిల్ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టు్లో విచారణ జరుగుతుంది. చంద్రబాబుకు రిలీఫ్ దక్కాలంటే.. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కచ్చితంగా అనుకూలంగా తీర్పురావాలి.
తీర్పు అనుకూలంగా వస్తే చంద్రబాబుపై నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయి. మళ్లీ కొత్తగా ఏదైనా కేసు నమోదు చేయాలంటే 17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అలా అనుమతి తీసుకోలాంటే సీఐడీ నమోదుచేసే కేసుల్లో కచ్చితంగా గవర్నర్‌కు ప్రాథమిక ఆధారాలు చూపించాలి. అప్పుడే ఆయన పర్మిషన్ ఇస్తారు. కానీ ప్రాథమిక ఆధారాలు సీఐడీ సేకరిచడం కష్టం కావడమో..? లేదా సమయం పట్టడమో..? జరగవచ్చు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు భవితవ్యంతో పాటు టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్తానం తీర్పు కోసం ఇటు టీడీపీ, అటు వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout