Chandrababu: సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది..? చంద్రబాబు భవితవ్యంపై సస్పెన్స్..?

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 29 నుంచి రాజకీయ కార్యకలాపాలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. దీంతో చంద్రబాబు రాక కోసం పార్టీ శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంతో దాదాపు మూడు నెలల పాటు చంద్రబాబు ప్రజలకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. కానీ స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన ఆయన 52రోజులు రాజమండ్రి జైలులో ఉన్నారు. అనంతరం మధ్యంతర బెయిల్ వచ్చినా ఈనెల 28 వరకు కోర్టు షరతులు విధించడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కోర్టు షరతులు తొలగించడంతో ప్రజల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది.

ఇంతవరకు బాగానే ఉంది హైకోర్టు బెయిల్‌పై సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ విచారణకు వచ్చినా ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ రద్దు చేయడం అనేది ఉండకకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ దొరికినట్లు కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనపై మొత్తం ఆరు కేసులు నమోదుకాగా.. స్కిల్ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టు్లో విచారణ జరుగుతుంది. చంద్రబాబుకు రిలీఫ్ దక్కాలంటే.. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కచ్చితంగా అనుకూలంగా తీర్పురావాలి.

తీర్పు అనుకూలంగా వస్తే చంద్రబాబుపై నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయి. మళ్లీ కొత్తగా ఏదైనా కేసు నమోదు చేయాలంటే 17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అలా అనుమతి తీసుకోలాంటే సీఐడీ నమోదుచేసే కేసుల్లో కచ్చితంగా గవర్నర్‌కు ప్రాథమిక ఆధారాలు చూపించాలి. అప్పుడే ఆయన పర్మిషన్ ఇస్తారు. కానీ ప్రాథమిక ఆధారాలు సీఐడీ సేకరిచడం కష్టం కావడమో..? లేదా సమయం పట్టడమో..? జరగవచ్చు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు భవితవ్యంతో పాటు టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్తానం తీర్పు కోసం ఇటు టీడీపీ, అటు వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More News

Naga Chaitanya: అభిమానుల ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసిన నాగచైతన్య

అక్కినేని హీరో నాగచైతన్య తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. చైతూ మొదటిసారి మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో చేస్తుండటంతో

Telangana Elections 2023 :మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో వారం మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలందరూ తెలంగాణకు

Bigg Boss Telugu 7: 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' రైతుబిడ్డదే.. బిగ్‌బాస్ హౌస్‌లో దారుణహత్య, రంగంలోకి పోలీసులు

బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ రచ్చ నడుస్తోంది. గత వారం ప్రిన్స్ యావర్ దానిని చేజిక్కించుకున్నప్పటికీ .. గేమ్ రూల్స్ ప్రకారం ఆడలేదంటూ నాగార్జున ఆధారాలు బయటపెట్టారు.

Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క సోదరుడిపై దాడి

తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష్ సోదరుడిపై దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం

Vichitra: హీరో బాలకృష్ణపై నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన మాజీ నటి విచిత్ర బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.