అక్కడ ఫిక్సయిన 'పుష్ప'.. నిర్మాతలేం చేశారంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో రూపొందుతో్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. రాజమండ్రికి సమీపంలో ఉండే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకోసం రాజమండ్రిలో ఓ రిసార్ట్ అంతటినీ యూనిట్ సభ్యులు బుక్ చేశారట. ఈ షెడ్యూల్ పూర్తయ్యే వరకు యూనిట్ అంతా ఈ రిసార్ట్‌లో ఉండాలని నిర్మాతలు ఫిక్స్ అయిన తర్వాత ఈ రిసార్ట్‌ను బుక్ చేశారని టాక్ వినిపిస్తోంది. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది.
ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారని, తన పాత్ర పేరు పుష్పరాజ్ అని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న తరుణంలో కోవిడ్ ప్రభావం ప్రారంభం కావడంతో రెగ్యులర్ షూటింగ్ ఆగింది. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో త్వరలోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం బన్నీగడ్డం ఉన్న లుక్‌లో కనిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments