సభ్య సమాజానికి ఏం చెప్పాలని పాయల్?
- IndiaGlitz, [Friday,August 30 2019]
కొన్ని సినిమాలు జనాలకు ఆనందం కలిగించడానికి, మరికొన్ని జనాలను ఎడ్యుకేట్ చేయడానికి, ఇంకొన్ని అవేర్నెస్ కలిగించడానికి వస్తాయి. మరి 'ఆర్.డి.ఎక్స్.లవ్'ను ఏ కోవలోకి తీసుకోవాలి? పైగా ట్రైలర్ నిండుగా అడల్ట్ కంటెంట్ షాట్స్ తో నిండిన ఈ సినిమాకు సెన్సార్ కూడా 'ఎ' తప్ప ఇంకేమీ ఇవ్వలేదేమో.
'ఆర్.ఎక్స్.100' తర్వాత పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న సినిమా 'ఆర్.డి.ఎక్స్.లవ్'. తేజస్కంచెర్ల ఇందులో హీరో. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. శంకర్ భాను దర్శకుడు. రథన్ సంగీతం చేశారు. సి.కల్యాణ్ తన హ్యాపీ మూవీస్ ద్వారా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ గురువారం ఉదయం విడుదలైంది. ఆద్యంతం 'ఎ' కంటెంట్‌తో నిండిపోయింది. అంతే కాదు... ఒక్క మాటలో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే కండోమ్ యాడ్‌లాగా ఉంది.
ఇంట్లో పెద్దవాళ్లు లేనప్పుడు ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకుంటే కనీసం సేఫ్టీలైనా దగ్గర పెట్టుకోవాలి... అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం కండోమ్ అనే పదానికి పర్యాయపదంగా సేఫ్టీ వాడారు. అక్కడిదాకా బాగానే ఉందనుకుంటే, ఆఖరిన పాయల్ నోటి వెంట'మీరెప్పుడైనా అపరిచితుడితో సెక్స్ చేశారా' అనే డైలాగ్ వినిపిస్తుంది.
మాటల్లోనే హీటు పుట్టించాలని ప్రయత్నించినట్టున్నాడు దర్శకుడు. ఈ టీజర్‌ను కుర్రకారు ఎలా రిజీవ్ చేసుకున్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం హెల్దీగా రిజీవ్ చేసుకోలేరన్నది వాస్తవం.
పాయల్ రాజ్‌పుత్‌కి ఇప్పుడు చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. ఆమె వెంకటేష్ సరసన వెంకీమామలో టీచర్‌గా నటిస్తోంది. మరోవైపు డిస్కో రాజాలో రవితేజ పక్కన నటిస్తోంది. 'ఆర్.ఎక్స్.100'లో తన సెక్సీ ఫీల్సింగ్స్ తో కుర్రకారు మతి పోగొట్టిన పాయల్ తాజాగా 'ఆర్.డి.ఎక్స్.లవ్'లో మరో రెండాకులు ఎక్కువే చదివింది. మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటనేది ఆ ట్రైలర్లు విడుదలైతే గానీ తెలియదు మరి.