ధన్ రాజ్ కు ఎక్కువైందా..వెటకారం..ఏమౌతుందో....
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పుడెప్పుడో జగడం అనే సినిమాతో కమెడియన్ గా అవతారమెత్తిన ధనరాజ్ తనదైన శైలిలో సినిమాలతో అడపాదడపా నటిస్తూ పర్వాలేదనిపించుకుంటున్న తరుణంలో జబర్దస్త్ కామెడి ప్రోగాం ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుని తన పేరుకు ముందు ధనాధన్ చేర్చుకుని ధనాధన్ ధనరాజ్గా క్ష రేంజ్ లో గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో తాను నిర్మాతగా కూడా అవతారమెత్తాడు.
ఒక్కడి వరకు బాగానే ఉన్నా ధనరాజ్ నటిస్తున్న తాజా చిత్రం పనిలేని పులిరాజు ట్రైలర్ ఈ మధ్యనే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అదీ కూడా బాగానే ఉంది. కానీ ఆ ట్రైలర్ అసాంతం ఆకట్టుకునేలా ఉన్నా చివరలో వచ్చే డైలాగ్ లో దిల్ రాజే పిలిచినా నేను రాను అని ధనరాజ్ పలికిన డైలాగ్ సినీ వర్గాల చర్చకు దారి తీస్తుంది. ఎందుకంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన వారు కానీ, ప్రస్తుతం ఉన్న నటీనటులు, టెక్నిషియన్స్ ఎవరైనా కానీ దిల్ రాజు సంస్థలో పనిచేయాలనుకుంటూ ఉంటారు. అటువంటి దిల్‌రాజుని ఖాతరు చేయకుండా ఆయన్ని ధనరాజ్ అవమానించే ప్రయత్నం చేశాడని, పనిలేని పులిరాజు చిత్రంలో ఆ సదరు డైలాగ్ ఏ విధంగా ఆలోచించి పెట్టారో తెలియడం లేదు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆగ్రహానికి గురైతే మన పనిలేని పులిరాజు నిజంగానే పనిలేని ధనరాజుగా అవడం ఖాయమని సినీ వర్గాల భోగట్టా. ధనరాజ్ అచితూచి అడుగేస్తే మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com