ఇదెక్కడి ఖర్మ...విజయ్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏదైనా ఒకసారి జరిగితే తట్టుకోవచ్చు.. పదే పదే జరిగితే.. ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి అదే. తాజాగా విడుదలైన గీతగోవిందం సక్సెస్ సాధించింది. ఆ ఆనందంలో ఉండగానే ఆయనకు చేదువార్త తెలిసింది. ఆయన నటిస్తోన్న ఇంకో సినిమా ట్యాక్సీవాలా లీకైంది. గీత గోవిందం కూడా లీకైంది. అయినా యువత థియేటర్లకు వచ్చారు. సినిమా పెద్ద హిట్ అయింది.
సర్లే.. పోనీ అని అందులో నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉండగానే ట్యాక్సీవాలాకు సంబంధించి పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. ఈసినిమాను ఏకంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో అప్లోడ్ చేసేశారన్నది ఆ విషయం. ఇది తెలిసిన వెంటనే నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ డీజీపీ కేసీఎస్ రఘువీర్ ఈ కేస్‌ను టేకప్ చేశారు. ఫిల్మ్ చాంబర్‌లోని పైరసీ సెల్‌తోనూ మాట్లాడారు రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ అనే జీమెయిల్ ఐడీలను గుర్తించారు. సినిమా ఉన్న గూగుల్ డ్రైవ్ లింక్స్ ని కనిపెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments