కమల్ ... 'చీకటి రాజ్యం' కథేంటి...?

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

కమల్‌హాసన్‌, త్రిష కలసి నటిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. ఈ చిత్రాన్ని రాజేశ్‌ ఎం సెల్వ తెర‌కెక్కిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ సోదరుడు చంద్రహసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష..మ‌ళ్లీ ఇప్పుడు క‌మ‌ల్ తో న‌టిస్తుంది. ఇక అసలు విష‌యానికి వ‌స్తే...ఈ చిత్రంలో క‌మ‌ల్ పోలీస్ శాఖ‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వింగ్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నార‌ట‌.

మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ వ్యాపారం చేసే చీక‌టి ప్ర‌పంచంలోని నేర‌స్థుల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ఉంటాడ‌ట క‌మ‌ల్. ఆ క్ర‌మంలో క‌మ‌ల్ కుమారుడు కిడ్నాప్ అవుతాడ‌ట‌. ఆ స‌మ‌యంలో కిడ్నాప్ అయిన త‌న కుమారుడుని కాపాడుకునేందుకు క‌మ‌ల్ ఏం చేసాడ‌నేదే చీక‌టి రాజ్యం క‌థ‌. అది సంగ‌తి. అయితే చీక‌టి రాజ్యం గురించి క‌మ‌ల్ ని అడిగితే...ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. .ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు అంటున్నారు. మ‌రి..క‌మ‌ల్ కి చీక‌టి రాజ్యం ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో..?

More News

తమన్నా చేయడం లేదట

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రూస్ లీ’ లో ఓ ఐటెమ్ సాంగ్ చేయనుందనే వార్తలు వినపడ్డాయి.

ఈరోజు సెన్సార్ జరుపుకోనున్న తేజ్ చిత్రం

‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది.

'నాన్నకు ప్రేమతో' టీజర్ రిలీజ్ ఎప్పుడు...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్,డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం నాన్నకు ప్రేమతో.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

'పులి' ఆడియో వాయిదా..

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పులి’. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది.

ఖైరతాబాద్ లో 'డిక్టేటర్'

బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ సినిమా రెండు షెడ్యూళ్ళను పూర్తి చేసుకుంది.