అఖిల్ మూవీ కథేంటి...?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న నాగార్జున మరో వారసుడు అఖిల్. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఫస్ట్ మూవీని హీరో నితిన్ నిర్మించిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అఖిల్ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ...ఆఫ్రికాలో భూమధ్యరేఖ వద్ద నివసించే ట్రైబల్స్ సూర్యుడుని జువా అని పిలుస్తారు అని చెప్పారు.
అలాగే అఖిల్ స్టిల్స్ చూస్తుంటే... అఖిల్ చేతిలో ఓ బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ చుట్టునే కథ ఉంటుందని తెలుస్తుంది. ఆ బాల్..కోసం అఖిల్ ఎంత వరకు వెళ్లాడు..? ఆ..బాల్ అఖిల్ కి దక్కకుండా ఎవరు..ఎందుకు అడ్డుకుంటున్నారు..? అనేది తెరపై చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. సోషియో ఫాంటసీ స్టోరీతో ఈ మూవీ రూపొందుతుండడంతో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరి...ట్రైలర్ లో తోనే అదరగొట్టేస్తున్న అఖిల్...ఇక మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో తెలుసుకోవాలంటే అక్టోబర్ 22 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com