వినాయక్ హీరోయిన్ వార్తల వెనుక సీక్రెట్ ఏంటి?
Send us your feedback to audioarticles@vaarta.com
పలువరు స్టార్ హీరోలను డైరెక్టర్ చేసి స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిన వి.వి.వినాయక్‌కి మరో సినిమా చేయడానికి చాలా గ్యాపే వచ్చింది. ఆ సమయంలో ఆయన అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా ఆయన హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది. `శరభ` ఫేమ్ నరసింహరావు దర్శకత్వంలో `సీనయ్య` అనే సినిమాలో హీరోగా నటించడానికి ఓకే చేయడం సినిమా స్టార్ట్ కావడమూ జరిగింది.
ఈ సినిమాలో వినాయక్ మెకానిక్ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకు సంబంధించిన లుక్ కూడా విడుదలైంది. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా అంటే వినాయక్ భార్య పాత్రలో శ్రియా శరన్ నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై వస్తున్న వార్తల్లో రెండు వందల శాతం నిజం లేదని విశ్వసనీయ వర్గాలు ఖండించాయి.
శ్రియా శరన్‌ను పేరు ప్రస్తావనే రాలేదని, అయితే ఇద్దరి ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. త్వరలోనే హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే దానిపై నిర్మాత దిల్‌రాజు ఓ నిర్ణయం తీసుకుంటాడట. తన కూతర్లకు జరిగిన అన్యాయంపై మెకానిక్‌గా మారిన ఓ రైతు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేదే సినిమా కథ అని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments