వినాయ‌క్ హీరోయిన్ వార్త‌ల వెనుక సీక్రెట్ ఏంటి?

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

ప‌లువ‌రు స్టార్ హీరోల‌ను డైరెక్ట‌ర్ చేసి స్టార్ డైరెక్ట‌ర్ లిస్టులో చేరిన వి.వి.వినాయ‌క్‌కి మ‌రో సినిమా చేయ‌డానికి చాలా గ్యాపే వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న అనూహ్యంగా ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఫ‌లితంగా ఆయ‌న హీరోగా తెరంగేట్రం చేయ‌డానికి రంగం సిద్ధ‌మైంది. 'శ‌ర‌భ‌' ఫేమ్ న‌ర‌సింహ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 'సీన‌య్య‌' అనే సినిమాలో హీరోగా న‌టించ‌డానికి ఓకే చేయ‌డం సినిమా స్టార్ట్ కావ‌డ‌మూ జ‌రిగింది.

ఈ సినిమాలో వినాయ‌క్ మెకానిక్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అందుకు సంబంధించిన లుక్ కూడా విడుద‌లైంది. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా అంటే వినాయ‌క్ భార్య పాత్ర‌లో శ్రియా శ‌ర‌న్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వార్త‌లు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ విష‌యంపై వ‌స్తున్న వార్త‌ల్లో రెండు వంద‌ల శాతం నిజం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు ఖండించాయి.

శ్రియా శ‌ర‌న్‌ను పేరు ప్ర‌స్తావ‌నే రాలేద‌ని, అయితే ఇద్ద‌రి ముగ్గురు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై నిర్మాత దిల్‌రాజు ఓ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ట‌. త‌న కూత‌ర్ల‌కు జ‌రిగిన అన్యాయంపై మెకానిక్‌గా మారిన ఓ రైతు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌నేదే సినిమా క‌థ అని టాక్‌.

More News

విజ‌య‌శాంతి రీ ఎంట్రీ అందుకే ఆల‌స్య‌మైందా?

లేడీ అమితాబ్‌, రాముల‌మ్మ దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు.

మా 'జార్జ్ రెడ్డి' యూత్ కి కనెక్ట్ అయ్యాడు - దర్శకుడు జీవన్ రెడ్డి,సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది.

సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా ప్రొడక్షన్ 2 ప్రారంభం

ఎస్ పి క్రియేషన్స్ సమర్పణలో యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్2గా సంపత్ శ్రీను దర్శకత్వంలో

నిత్యానంద ఆశ్రమంలో బాలికలకు టార్చర్... వీడియోలు చేయాలంటూ హింసించిన వైనం

వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని

ఎక్స్‌క్లూజివ్‌...డైరెక్ట‌ర్‌కి డ‌బ్బులివ్వ‌ని స్టార్ నిర్మాత‌

సినిమా రంగంలో పైకి క‌న‌ప‌డే ఆప్యాయ‌త‌లు, అనురాగాలు వేరు.. కానీ లోపల‌ జ‌రిగే విష‌యాలు వేరుగా ఉంటాయి.