వైజాగ్ కి1942 ఏప్రిల్ 6 కి ఉన్న లింక్ ఏమిటి..?
- IndiaGlitz, [Thursday,September 10 2015]
వైజాగ్ కి, 1942 ఏప్రిల్ 6 కి ఉన్న లింక్ ఏమిటి..? ప్లీజ్ థింక్ అంటున్నది ఎవరో కాదు.. మెగా హీరో వరుణ్ తేజ్. క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ కంచె చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్దం నేపధ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం. రెండో ప్రపంచ యుద్దం సమయంలో 1942 ఏప్రిల్ 6న వైజాగ్ నగరం పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకుంది.
అదేమిటంటే...ఆ రోజు బంగాళాఖాతం మీదుగా జపాన్ కు చెందిన యుద్ద నౌకలు విశాఖ సముద్రం సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు అమెరికా యుద్ద నౌకలు బాంబుల వర్షం కురిపించాయట. కానీ లక్కీగా వేసిన బాంబు పేలలేదట. ఒకవేళ పేలి ఉంటే వైజాగ్ కి పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ విషయాన్నికంచె సినిమాలో చూపించారనుకుంట. అసలు ఈ విషయం ఎంత మందికి తెలుసో... తెలుసుకోవడం కోసం 1942 ఏప్రిల్ 6కి వైజాగ్ కి ఉన్నలింక్ ఏమిటి అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్ లో ప్రశ్నిస్తున్నాడు అది అసలు సంగతి.