ర‌వితేజ టైటిల్ మార్పుకి కార‌ణం అదేనా?

  • IndiaGlitz, [Thursday,October 08 2015]

'భ‌ద్ర'.. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం తెలుగు తెర‌పై కాసుల వ‌ర్షం కురిపించిన చిత్ర‌మిది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ సినిమాతోనే నేటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు హ్యాట్రిక్ హిట్స్‌ని పూర్తిచేసుకున్నాడు. 'ఒక్క‌డు' స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా.. ఆ ఛాయ‌లు ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ విజ‌యాన్ని రుచి చూసింది స‌ద‌రు సినిమా టీమ్‌.

క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ప‌దేళ్ల త‌రువాత ర‌వితేజ‌, నిర్మాత దిల్ రాజు కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న‌ట్లు ప్ర‌స్తుతం వార్త‌లు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాకి 'ఎవ‌డో ఒక‌డు' అనే పేరు వినిపించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు టైటిల్ అది కాదంటూ.. 'బోగి' అంటూ మ‌రో పేరు వినిపిస్తోంది. ఇలా టైటిల్ మార్పుకి సెంటిమెంట్‌నే కార‌ణ‌మంటూ టాలీవుడ్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

ర‌వితేజ‌, దిల్ రాజు కాంబినేష‌న్‌లో తొలి చిత్రం 'భ‌ద్ర' లోని మొద‌టి అక్ష‌రం ఇంగ్లిష్ లెట‌ర్స్ ప్ర‌కారం 'బి'తో మొద‌లై.. బిగ్గెస్ట్ హిట్ అయిన నేప‌థ్యంలో.. రెండో చిత్రానికి కూడా అదే సెంటిమెంట్తో 'బి'తో మొద‌లయ్యే పేరుని స‌ద‌రు చిత్ర బృందం ఎంచుకుంద‌ని వారు విశ్లేషిస్తున్నారు. మ‌రి టైటిల్ మార్పుకి అస‌లైన కార‌ణ‌మేమిటో ఆ చిత్ర‌యూనిట్‌కే తెలియాలి.

More News

లెక్క స‌రిపెడుతున్న‌ ర‌కుల్‌

2011లో రిలీజైన 'కెర‌టం'తో ఎంట్రీ ఇచ్చినా.. రెండేళ్ల త‌రువాత వ‌చ్చిన 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌'తోనే హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

అతనితో నయనతార మూడోసారి?

నయనతార హవా తమిళ నాట మాములుగా లేదు.అందుకే ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోలు,చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఆమె పక్కన నటించేందుకు సిద్ధపడుతున్నారు.

అసిన్ పెళ్లి పై కామెంట్ చేసిన అనుష్క

టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్..టాప్ స్టార్స్ తో కలసి నటించిన అందాల భామ అసిన్. గజని సినిమాలో నటించిన అసిన్ ఆ..సినిమాలో ఎలాగైతే ఓ సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ తో ప్రేమలో పడుతుందో...

బ్రూస్ లీ తమిళ్ ఆడియో రిలీజ్ వాయిదా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం బ్రూస్ లీ.

స్వీటీ..అదిరిందంటున్న జక్కన్న...

జక్నన్న అంటే దర్శకధీరుడు రాజమౌళి అని తెలుసు.మరి..స్వీటీ అంటే ఎవరనుకుంటున్నారా..