రవితేజ టైటిల్ మార్పుకి కారణం అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
'భద్ర'.. సరిగ్గా పదేళ్ల క్రితం తెలుగు తెరపై కాసుల వర్షం కురిపించిన చిత్రమిది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాతోనే నేటి సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హ్యాట్రిక్ హిట్స్‌ని పూర్తిచేసుకున్నాడు. 'ఒక్కడు' స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా.. ఆ ఛాయలు ఎక్కువగా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ విజయాన్ని రుచి చూసింది సదరు సినిమా టీమ్.
కట్ చేస్తే.. మళ్లీ పదేళ్ల తరువాత రవితేజ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాకి 'ఎవడో ఒకడు' అనే పేరు వినిపించింది. కట్ చేస్తే.. ఇప్పుడు టైటిల్ అది కాదంటూ.. 'బోగి' అంటూ మరో పేరు వినిపిస్తోంది. ఇలా టైటిల్ మార్పుకి సెంటిమెంట్‌నే కారణమంటూ టాలీవుడ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
రవితేజ, దిల్ రాజు కాంబినేషన్‌లో తొలి చిత్రం 'భద్ర' లోని మొదటి అక్షరం ఇంగ్లిష్ లెటర్స్ ప్రకారం 'బి'తో మొదలై.. బిగ్గెస్ట్ హిట్ అయిన నేపథ్యంలో.. రెండో చిత్రానికి కూడా అదే సెంటిమెంట్తో 'బి'తో మొదలయ్యే పేరుని సదరు చిత్ర బృందం ఎంచుకుందని వారు విశ్లేషిస్తున్నారు. మరి టైటిల్ మార్పుకి అసలైన కారణమేమిటో ఆ చిత్రయూనిట్‌కే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com