ఎవరికీ రాని మేజిక్ ఫిగర్.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. గ్రేటర్ ప్రజానీకం అన్ని పార్టీలను గెలుపు ముంగిట నిలబెట్టేసి తేల్చుకోమని బిగ్ టాస్క్ ఇచ్చినట్టుగా అయింది. ఇప్పుడుంది అసలు కథ అంతా. ఎవరికైనా మేయర్ పీఠం దక్కించుకునే ఛాన్స్ ఉంది అయితే ఆ అవకాశం టీఆర్ఎస్కే ఎక్కువగా ఉంది. కానీ ఇది అంత సులువైతే ఏమీ కాదు. ఏమాత్రం అప్రమత్తత లోపించినా.. వేగంగా అడుగులు వేయకపోయినా నోటి దాకా వచ్చింది.. నేల పాలయినట్టు అవుతుంది. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా నడుచుకోవాల్సిన తరుణం ఇదే.
గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీఆర్ఎస్కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు వచ్చాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇప్పుడు వాటిలో దాదాపు సగం మాత్రమే దక్కాయి. దీంతో ఏం చేయాలో తెలియక గులాబీ బాస్ తల పట్టుకోవాల్సి వచ్చింది. అటు ఎంఐఎంతో కలిసిపోదామంటే.. వాళ్లు మేయర్ పీఠం అడుగుతారు. ఇంత పెద్ద పార్టీ అయ్యుండి.. వాళ్లకు మేయర్ అంటే సిగ్గుచేటు. అంతే కాకుండా సొంత పార్టీలోనే అసంతృప్తి, వ్యతిరేకత మొదలవుతుంది.
నిన్న మొన్నటి వరకూ అంటే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కేసీఆర్ చేసిందే శాసనం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకవేళ ఎంఐఎంకు మేయర్ పీఠం ఇస్తే.. రేపొద్దున దీన్నే బీజేపీ మరో అస్త్రంగా కూడా మలుచుకుంటుంది. అప్పుడది మరింత తలనొప్పిగా మారుతుంది. వాస్తవానికి ఎంఐఎం నుంచి తెలుగు వాళ్లు కూడా పోటీచేసి గెలిచిన స్థానాలున్నాయి. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్లను లాక్కోవాలని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అది జరిగితే కానీ.. కేసీఆర్ పరువు నిలబడేలా లేదు.
మరి కేసీఆర్ ఏం చేస్తారు? ఏం జరగబోతోందనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout