ఈ ట్వీట్‌కు అర్థమేంటి రష్మిక మందన్నా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతోంది. ‘గీత గోవిందం’ సినిమాతో ఈ బ్యూటీకి లక్ బాగా కలిసొచ్చింది. అప్పట్నుంచి అవకాశాల కోసం ఇక వెనక్కి చూసుకోవాల్సిన అక్కర్లేకుండా పోయింది. అంతేకాదండోయ్.. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సరసన కూడా ఈ ముద్దుగుమ్మ నటించేసింది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించి మెప్పించింది. ఇప్పుడు బన్నీ-సుక్కు కాంబోలో వస్తున్న సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తోంది.
ఇక అసలు విషయానికొస్తే.. సెలబ్రిటీలు త్వరగా అభిమానులకు సినిమాలు కాకుండా మరింత దగ్గరయ్యేందుకు సోషల్ మీడియా తెగ వాడేస్తుంటారు. రష్మిక మందన్నా కూడా అదే బాటలో నడుస్తోంది. తనకు సంబంధించిన ఏ విషయాన్నయినా సరే ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటుంది. సినిమాకు సంబంధించిన విషయాలు, ఫొటోలను సైతం షేర్ చేసుంటుంది. అయితే.. తాజాగా పోస్ట్ చేసిన రెండు ఫొటోల వెనుక ఆంతర్యమేంటో అర్థమవ్వట్లేదు. ఇంతకీ రష్మిక మనసులో ఏముందో తెలియట్లేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్‌లో ఏముంది..?
‘కొన్ని సందర్భాల్లో నేను బ్లర్ (అస్పష్టంగా)నే ఇష్టపడతాను’ అని రాసుకొచ్చింది. అంటే అస్పష్టంగా ఉండేవే ఆమెకు ఇష్టమని ఆ ట్వీట్ సారాంశమన్న మాట. అసలు ఈ ట్వీట్‌లో అర్థం, పరమార్థమేంటో.. దేన్ని ఉద్దేశించి ఇలా రాసుకొచ్చిందో ఆ భామకే తెలియాలి. ఈ ట్వీట్‌కు రెండో ఫొటోలను జతచేసిన రష్మిక.. ఒక ఫొటోలో Irreplaceable అని రాసి ఉంది. అంటే.. ఏదైనా ఒక స్థానాన్ని అతను తప్ప మరొకరు భర్తీ చేయలేరనే అర్థం కూడా వస్తుంది. అంటే.. రష్మిక మనసులో ఏముందో..? ఎవరున్నారో..? తెలియాలి మరి. కాగా.. మరో ఫొటోలో ముఖం మాత్రమే కనిపిస్తుండే బ్లర్‌గా ఉంది.
I sometimes like blurry better..!???? pic.twitter.com/laMJm0H3hG
— Rashmika Mandanna (@iamRashmika) March 5, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com