మహేష్ - విజయ్ మూవీకి ఉన్న లింకేంటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే...ఈ చిత్రానికి విజయ్ మూవీకి సంబంధం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే...విజయ్ - మురుగుదాస్ కాంబినేషన్లో తుపాకీ అనే చిత్రం రూపొందింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన తుపాకీ చిత్రం తెలుగు, తమిళ్ లో విజయం సాధించింది. ఇప్పుడు తుపాకీ చిత్రానికి సీక్వెల్ గా మహేష్ మూవీ రూపొందుతుంది అని టాక్. ఇదిలా ఉంటే...తమిళ్ ఆడియోన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేయచ్చు అనే ఉద్దేశ్యంతోనే తుపాకీ 2 గా ప్రచారం చేస్తున్నారు అనేది మరో వాదన. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా ఈ మూవీ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేసిన తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయనున్నారని సమాచారం. తమిళ ఆడియోన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేయడం కోసమే తుపాకీ 2 గా ప్రచారం చేస్తున్నారా..? లేక నిజంగానే తుపాకీ సీక్వెలా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com