చైనాను వణికిస్తున్న పాములు
Send us your feedback to audioarticles@vaarta.com
‘కరోనా’.. ఈ మూడు అక్షరాల పేరుగల వైరస్ పేరు వింటుంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు.. ఈ పేరు వింటే చాలు జనాలు దేశాలు దాటి వెళ్లిపోతున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడటంతో.. ఎప్పుడేం జరుగుతుందో..? భారత్‌కు వస్తే పరిస్థితేంటి..? అని దేశ ప్రజలు భయం భయంతో బతికేస్తున్నారు. అయితే అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది..? నిజంగానే పాముల నుంచి వచ్చిందా..? లేకుంటే మరే ఇతర జంతువుల నుంచి వచ్చిందా అనేదానిపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించి కీలక విషయాలను కనుకొన్నారు.
ఇప్పటికే సౌదీకి వచ్చేసింది!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పాముల నుంచి పాకినట్లు తెలుస్తోంది. అది కూడా ఆ వైరస్‌కు మూలమైన చైనా సిటీ వుహాన్నుంచే మనుషుల్లోకి వచ్చిందట. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ అడాల్ఫో గార్సియా స్టడీలో ఈ విషయం వెల్లడైంది.! మొట్ట మొదట చైనాలో పాకిన ఈ వైరస్ ఇప్పటికే 25మంది ప్రాణాలను బలితీసుకుంది!. మరోవైపు థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక్టీరియా సౌదీకీ సైతం పాకింది.
జంతువులకు వైరస్‌ను ఎలా ట్రాన్స్మిట్ చేస్తుంది!?
వుహాన్‌లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్ పాకిందని అధ్యయనంలో తేలింది. 2019-nCoV ఒక వైరల్ ప్రోటీన్ ‘పున: సంయోగం’ కలిగి ఉంటుందని.. ఇది కణాలపై గ్రాహకాలను గుర్తించి బంధిస్తుందని.. అనంతరం సంక్రమణ, వ్యాధికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రజల్లో జంతువుల మధ్య వ్యాప్తి చెందే అంటువ్యాధుల వల్ల కలిగే వ్యాధి అని తేలింది. ఆ వైరస్ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించగా.. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్జీన్స్కాంబినేషన్తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. అంతేగాకుండా పాముల్లోని జీన్స్‌తోనూ వాటిని పోల్చి చూసి, పాముల నుంచి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
ఎలా వచ్చింది!?
గబ్బిలాల్లో కనపడే రకం కరోనా వైరస్, మరో గుర్తు తెలియని జీవిలోని వైరస్‌తో కలిసి ఈ కొత్త వైరస్ ఏర్పడినట్టు వారి పరిశోధనలో తేలింది. ఆ రెండో జీవి పాము అయ్యే అవకాశం ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. RNA కోడింగ్ క్రమం 2019-nCoV కూడా గబ్బిలాలలో వైరస్ యొక్క పరివర్తన చెందిన రూపం అని తెలుస్తుంది. ఈ వైరస్‌లోని ప్రోటీన్ సంకేతాలు పాముల్లో ఉన్న వాటితో సమానంగా ఉంటాయి. ఇది వైరస్ ప్రజలకు వ్యాప్తి చెందక ముందే పాములలో నివసిస్తుందని తెలుస్తోంది. కాగా.. వైరస్‌కు మూలకారణమైన వుహాన్ సిటీకి రాకపోకలను చైనా నిలిపివేసింది. అంతేకాదు.. వుహాన్ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. దీంతో అక్కడి ప్రజలు తిండి తిప్పలు లేక.. అక్కడ్నుంచి వేరో చోటకు వెళ్లలేక ముప్పుతిప్పలు పడుతున్నారు.
హైదరాబాద్‌లో హై అలెర్ట్!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి హై అలర్ట్ ప్రకటించారు. చైనా, హాంగ్ కాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com