నాగ్ లేటెస్ట్ సెంటిమెంట్ ఏమిటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున సెంటిమెంట్ ఏమిటి అని అడిగితే ఠక్కున డిసెంబర్ నెల అని చెబుతారు. మాస్, మన్మధుడు, డాన్, కింగ్...ఇలా నాగ్ కి సక్సెస్ ని అందించిన చిత్రాలన్నీ డిసెంబర్లో రిలీజ్ అయినవే. అందుకనే డిసెంబర్ నాగ్ సెంటిమెంట్ గా మారింది. లేటెస్ట్ గా నాగ్ కి మరో సెంటిమెంట్ యాడయ్యింది. అదేమిటంటారా...అక్కినేని కుటుంబమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరచిపోలేని చిత్రం మనం.
ఈ సినిమా పూర్వజన్మ కధాంశంతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ సరసన శ్రియ నటించింది. నాగ్, శ్రియ లపై చిత్రీకరించిన సీన్స్ మైసూర్ లో చిత్రీకరించారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు నాగ్ లేటెస్ట్ మూవీ సొగ్గాడే చిన్ని నాయన.ఈ సినిమా కూడా పూర్వజన్మ కథాంశంతో రూపొందుతుంది. అందుకనే నాగ్ సెంటిమెంట్ గా ఫీలై మనం చిత్రం షూట్ చేసిన మైసూర్ లోనే సొగ్గాడే చిన్ని నాయన లేటెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసాడట. ఈ నెల 14 నుంచి 30 వరకు జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందట. మరి..నాగ్ లేటెస్ట్ సెంటిమెంట్ మైసూర్ ప్లస్ డిసెంబర్ సెంటిమెంట్ తో వస్తున్న సొగ్గాడు చిన్ని నాయన ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com