నాగ్ లేటెస్ట్ సెంటిమెంట్ ఏమిటి..?

  • IndiaGlitz, [Tuesday,September 15 2015]

టాలీవుడ్ కింగ్ నాగార్జున సెంటిమెంట్ ఏమిటి అని అడిగితే ఠ‌క్కున డిసెంబ‌ర్ నెల అని చెబుతారు. మాస్, మ‌న్మ‌ధుడు, డాన్, కింగ్...ఇలా నాగ్ కి స‌క్సెస్ ని అందించిన చిత్రాల‌న్నీ డిసెంబ‌ర్లో రిలీజ్ అయిన‌వే. అందుక‌నే డిసెంబ‌ర్ నాగ్ సెంటిమెంట్ గా మారింది. లేటెస్ట్ గా నాగ్ కి మ‌రో సెంటిమెంట్ యాడ‌య్యింది. అదేమిటంటారా...అక్కినేని కుటుంబ‌మే కాకుండా తెలుగు చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం మ‌నం.

ఈ సినిమా పూర్వ‌జ‌న్మ క‌ధాంశంతో రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ స‌ర‌స‌న శ్రియ న‌టించింది. నాగ్, శ్రియ ల‌పై చిత్రీక‌రించిన సీన్స్ మైసూర్ లో చిత్రీక‌రించారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు నాగ్ లేటెస్ట్ మూవీ సొగ్గాడే చిన్ని నాయ‌న‌.ఈ సినిమా కూడా పూర్వ‌జ‌న్మ క‌థాంశంతో రూపొందుతుంది. అందుక‌నే నాగ్ సెంటిమెంట్ గా ఫీలై మ‌నం చిత్రం షూట్ చేసిన మైసూర్ లోనే సొగ్గాడే చిన్ని నాయ‌న లేటెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసాడ‌ట‌. ఈ నెల 14 నుంచి 30 వ‌ర‌కు జ‌రిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్త‌వుతుంద‌ట‌. మ‌రి..నాగ్ లేటెస్ట్ సెంటిమెంట్ మైసూర్ ప్ల‌స్ డిసెంబ‌ర్ సెంటిమెంట్ తో వ‌స్తున్న సొగ్గాడు చిన్ని నాయ‌న ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో..?

More News

సన్నీ కండోమ్ గోల

బాలీవుడ్ హాట్టీ సన్నిలియోన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఈ పోర్న్ స్టార్ ఏకంగా కండోమ్ కి సంబంధించిన గొడవలో ఇరుక్కుంది.

భారీ రేటుకు అఖిల్ ఆడియో ప్ర‌సార హ‌క్కులు

అక్కినేని వంశం మూడోత‌రం నుంచి వ‌స్తున్న మ‌రో సంచ‌ల‌న యువ క‌థానాయ‌కుడు అఖిల్. తొలి సినిమాకే అఖిల్ స్టార్ హీరో రేంజ్ లో బిజినెస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు.

జూనియర్ డబుల్ ధమాకా

బీవీయస్ యన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ యూరోప్ లో జరుగుతోంది.

త్రివిక్రమ్ అన్నిసార్లు చెప్పాడా?

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అ...ఆ... ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అని దానికి అర్థం. ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ప‌వ‌న్ పై సెటైర్స్

నిన్న అన్న‌పూర్ణ సుంక‌ర‌...మ‌న డైరెక్ట‌ర్స్ కి సినిమాలు తీయ‌డం రాదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి బాగా పాపుల‌ర్ అయిపోయింది.