'పులి' సెన్సార్ రిపోర్ట్ ఏమిటి...?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం పులి. ఈ చిత్రంలో విజయ్ సరసన హాన్సిక, శ్రుతిహాసన్ నటించారు. అతిలోక సుందరి శ్రీదేవి ఈ చిత్రంలో రాణిగా నటించడం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పులి చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది. తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న పులి క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది.
అక్టోబర్ 1న తెలుగు, తమిళం, హిందీల్లో గ్రాండ్ రిలీజ్ కి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై శోభరాణి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి దాదాపు 600 కోట్లు వసూలు చేసి చరిత్ర స్రుష్టించింది. తమిళ్ లో చింబుదేవన్ తెరకెక్కించిన పులి చిత్రం పై ఆరేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కానీ తమిళ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.... పులి సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేదని.. యావరేజ్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే... బాహుబలి రేంజ్ సక్సెస్ పులి కి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. మరి..పులి ఏ రేంజ్ లో కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com