'పులి' సెన్సార్ రిపోర్ట్ ఏమిటి...?

  • IndiaGlitz, [Monday,September 21 2015]

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం పులి. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న హాన్సిక‌, శ్రుతిహాస‌న్ న‌టించారు. అతిలోక సుంద‌రి శ్రీదేవి ఈ చిత్రంలో రాణిగా న‌టించ‌డం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన‌ పులి చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది. తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న పులి క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది.

అక్టోబర్ 1న తెలుగు, తమిళం, హిందీల్లో గ్రాండ్ రిలీజ్ కి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై శోభరాణి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి చ‌రిత్ర స్రుష్టించింది. త‌మిళ్ లో చింబుదేవ‌న్ తెర‌కెక్కించిన పులి చిత్రం పై ఆరేంజ్ లో అంచ‌నాలు ఉన్నాయి. కానీ త‌మిళ సెన్సార్ రిపోర్ట్ ప్ర‌కారం.... పులి సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా లేద‌ని.. యావ‌రేజ్ మూవీగా నిలుస్తుంద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి చూస్తే... బాహుబ‌లి రేంజ్ స‌క్సెస్ పులి కి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. మ‌రి..పులి ఏ రేంజ్ లో క‌లెక్ష‌న్స్ క‌లెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నితిన్ కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడు...?

నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం అ ఆ.టైటిల్ వెరైటగా ఉంది.అ ఆ అంటే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి.

కొరటాలకు 'శ్రీమంతుడు' కానుక...

'నేనొక్కడినే','ఆగడు' సినిమా ఫెయిల్యూర్స్ తో మహేష్ లో ఓ రకమైన బెంగ పట్టుకుందనే చెప్పాలి.

తేజ్ గురించి పవన్ కేర్...

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ముగ్గురు మావయ్యలు నుండి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ్ గురించి కాస్తా ఎక్కువ శ్రద్ధే కనపరుస్తున్నాడట.

తేజ్ మూవీకి ముహుర్తం కుదిరింది...

‘పిల్లానువ్వు లేని జీవితం’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా, ఈ ఏడాది ‘పటాస్’ వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో

అఖిల్ మూవీ కథేంటి...?

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న నాగార్జున మరో వారసుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఫస్ట్ మూవీని హీరో నితిన్ నిర్మించిన విషయం తెలిసిందే.