బన్ని...భారీ ప్లాన్ ఏమిటి...?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

బ‌న్ని, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతుంది. అయితే బోయ‌పాటితో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉండ‌గానే బ‌న్ని నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప్లాన్ రెడీ చేస్తున్నాడు.

రేసుగుర్రంతో రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ సాధించిన బ‌న్ని...నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో మ‌రిన్ని రికార్డులు సాధించేలా ప‌క్కా ప్లాన్ వేస్తున్నాడు. అందుక‌నే మంచి క‌థ‌తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించేందుకు త‌గ్గ స్ర్కిప్ట్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. శ్రీమంతుడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హారీష్ శంక‌ర్ ల‌ను క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ ను క‌ల‌సి సినిమా చేద్దాం క‌థ రెడీ చేయ‌మ‌న్నాడు. రేసుగుర్రంలా దూసుకెళుతున్న బ‌న్ని స్పీడు..ప్లాను..చూస్తుంటే.... ఫ్యూచ‌ర్ లో బ‌న్ని రేంజు, క్రేజు మ‌రింత పెర‌గ‌డం ఖాయం. ఏమంటారు..?