శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఏమిటి...?
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు...ఈ రెండు వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో శర్వానంద్. మంచి కథలను ఎంచుకుంటున్న శర్వానంద్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంథీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే విభిన్నకధాంశంతో ఈ చిత్రాన్ని గాంథీ తెరకెక్కిస్తున్నారట.
వరుస విజయాలు సాధిస్తున్న యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శర్వనంద్ సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఎక్సె ప్రెస్ రాజా అని సమాచారం. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు..చిత్రాలతో వరస విజయాలు సాధించిన శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా తో హ్యాట్రిక్ సాధిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments