మగధీర లో చెప్పింది ఇప్పుడు నిజం కానుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మగధీర లో చెప్పింది ఇప్పుడు నిజం కానుందా..? అంటే దేని గురించి అబ్బా...అంటూ తెగ ఆలోచిస్తున్నారా..? మ‌్యాటర్ ఏమిటంటే..మగధీర లో చిరు చరణ్ తో ఓ సీన్ లో...డాన్స్ వేయడం అంటే బాడీని ఓ.. ఊపి వేసేయడం కాదురా...మనం వేసే స్టెప్స్ కి వాళ్లు (ఆడియోన్స్) విజుల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి..అంటారు. ఇప్పుడు చరణ్ బ్రూస్ లీ చిత్రంలో చిరు సాంగ్ ఆరేంజ్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకనే చిరు ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసే బాధ్యత మల్టీ టాలెంటడ్ లారెన్స్ కే అప్పగించారట.
లారెన్స్ ప్రస్తుతం అందరి అంచనాలను అందుకునేలా చిరు సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. బాలీవుడ్ లో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ ల కజరారే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటనే చిరు, చరణ్ ల స్పెషల్ సాంగ్ గా రీమేక్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. హిట్లర్, ఇంద్ర, ఠాగూర్...తదితర చిత్రాల్లో చిరుతో లారెన్స్ వేయించిన స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ఇప్పుడు చిరు, చరణ్...లతో లారెన్స్ వేయించే స్టెప్స్ కి, ఫ్యాన్స్ విజుల్స్ వేస్తే మగధీరలో చిరు చెప్పినట్టు...ధియేటర్స్ టాప్ లేచిపొద్దేమో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com